Breaking News

అడవిలో జంతువుల వేట.. వివాదంలో 'మోహన్ బాబు' సిబ్బంది

Published on Tue, 12/31/2024 - 10:24

సినీ నటుడు మంచు మోహన్‌ బాబు సిబ్బంది నిర్వాకం వల్ల ఆయన పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. హైదరాబాద్‌ శివారు ప్రాంతం జల్‌పల్లిలో మోహన్‌ బాబు నివాసం ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇంటికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో ఆయన సిబ్బంది అడవి పందులను వేటాడారు. తన కుమారుడు మనోజ్‌ హెచ్చరించినా వారు మాట వినలేదని తెలుస్తోంది.

అడవి పందిని వేటాడి తీసుకెళ్లినట్లు మేనేజర్ కిరణ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయని మనోజ్‌ అన్నాడు. ఆయనతో పాటు ఎలక్ట్రీషియన్ దుర్గా ప్రసాద్ కూడా ఉన్నాడని తెలిపాడు. వారిద్దరి చర్యలను తప్పుపడుతూ  మంచి మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పారట. అడవి పందులను వేటాడొద్దని వారిద్దరినీ హెచ్చరించినప్పటికీ  మాట వినలేదని మనోజ్‌ తెలుపుతున్నాడు.  అయితే, ఆ సమయంలో మోహన్‌ బాబు అక్కడ లేరని తెలుస్తోంది.

మంచు ఫ్యామిలీలో గొడవల వల్ల జల్‌పల్లి నివాసం గురించి తెరపైకి వచ్చింది. అక్కడ జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్‌బాబు మీద కేసు కూడా నమోదు అయింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించి మోహన్‌బాబు అరెస్టు విషయంలో ఎలాంటి ఆలస్యం లేదని, చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని ఇప్పటికే రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. 


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)