Breaking News

అమ్మతోడు.. ఆస్తికోసం కాదు

Published on Thu, 04/10/2025 - 07:46

 హైదరాబాద్‌: జల్‌పల్లిలోని సినీ నటుడు మోహన్‌బాబుకు సంబంధించిన మంచు టౌన్‌షిప్‌ వద్ద మరోసారి వివాదం నెలకొంది. తాను లేని సమయంలో నార్సింగిలోని తన నివాసం వద్ద ఉన్న కార్లను విష్ణు దొంగలించాడని పేర్కొంటూ ఈ నెల 8న మంచు మనోజ్‌ నార్సింగి ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఉదయం 8.30 గంటలకు జల్‌పల్లి శివారులోని మంచు టౌన్‌షిప్‌ గేట్‌ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మీడియాను లోనికి రానివ్వకుండా టౌన్‌షిప్‌ చుట్టూ కిలోమీటర్‌ సరిహద్దులో ఆంక్షలు విధించారు. పోలీసుల సూచనతో 11.45 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోతూ మనోజ్‌ మీడియా ఎదుట తన ఆవేదన వెలిబుచ్చారు.   

అమ్మపై ప్రమాణం  
గతేడాది డిసెంబర్‌ 8వ తేదీ నుంచి మంచుటౌన్‌షిప్‌లో ఆరంభమైన గొడవ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. జల్‌పల్లిలో మొదలైన ఈ గొడవ కాలక్రమేణా తిరుపతిలోని మోహన్‌బాబు వర్సిటీ వరకు తాకింది. జల్‌పల్లిలో తాజాగా మనోజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 27న తాను, తన భార్య ఇంట్లో ఉన్న సమయంలో బయటి వ్యక్తులు గుమిగూడుతున్న విషయమై పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువారెడ్డికి ఫోన్‌తో పాటు, 100 డయల్‌కు కాల్‌ చేసి రక్షణ కల్పించాలని కోరామన్నారు. అయినప్పటికీ తననే ఇంటి నుంచి బయటికి రావాలని పోలీసులు తెలిపారన్నారు. ఏప్రిల్‌ 2న తన కుమార్తె మొదటి పుట్టిన రోజు ఇక్కడే పరిమితంగా చేసుకుందామనుకున్నప్పటికీ, స్థానిక పరిస్థితుల దృష్ట్యా రాజస్థాన్‌లోని జైపూర్‌ వెళ్లామన్నారు. అంతకుముందే నేను అక్కడ లేను, విష్ణును అక్కడ ఏమైనా చేసుకోమని మా అ మ్మకు కూడా తెలిపానన్నారు. 

అమ్మపై ప్రమాణం.. ఇది ఆస్తి కోసం కాదు అన్నారు. తిరుపతిలోని యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి తంతును ప్రశ్నించినందుకే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. డిసెంబర్‌ 8 నుంచి ఇప్పటి వరకు పహాడీషరీఫ్‌ పోలీసులు ఒక్క ఛార్జిïÙట్‌ కూడా దాఖలు చేయలేదని, టౌన్‌షిప్‌లో తనకు సంబంధించి మూడు పెట్‌ డాగ్‌లు, పిల్లలకు సంబంధించి వస్తువులున్నాయని తెలిపారు. అవి తీసుకొని వెళ్తానని చెప్పినా లోనికి వెళ్లనీయడం లేదన్నారు. పోలీసులకు అన్ని ఆధారాలు ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యహరించారని ఆరోపించారు. తాను రాజస్థాన్‌కు వెళ్లిన వెంటనే విష్ణు తన కార్లను చోరీ చేశారని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇంట్లో ఉన్న తన పాత జ్ఞాపకాలను సైతం తొలగించారన్నారు. రౌడీషిటర్ల ఆగడాలపై సీఐకి చెబితే‘అవునా పాపం’ కదా అంటున్నారు తప్పా చర్యలు శూన్యమన్నారు.

 కోర్టులను తప్పదోవ పట్టిస్తున్న ఘటనలపై తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కోర్టు ఆదేశాలున్నా ఇంట్లోకి రానివ్వడం లేదన్నారు. బైండోవర్‌ విషయం తనకు వర్తించినప్పుడు, విష్ణుకు ఎందుకు వర్తించవని ఆయన మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం కోసం సినిమాలో స్త్రీ వేషధారణలోనూ నటించానని ఆవేదన వ్యక్తం చేశారు. మనోజ్‌ సంబంధించిన ఎలాంటి విషయాలైనా కావాలంటే.. ఇస్తా బిడ్డ అని నాన్న విష్ణుకు హామీ ఇచ్చారని తెలిపారు. పోలీసులు తన ఫిర్యాదులపై ఎక్కడ కూడా ఛార్జిషీట్‌లో దాఖలు చేయలేదన్నారు. ఇదిలా ఉండగా మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణు యూపీలో కన్నప్ప సినిమా ప్రమోషన్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి సినిమా కథను వివరించారు.   

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)