Breaking News

మాంచెస్టర్ సిటీని కుదిపేసిన 'అతడు'.. దటీజ్‌ మహేశ్ బాబు

Published on Sat, 10/18/2025 - 18:38

పశ్చిమ ఆఫ్రికాలోని ఐవోరియన్ దేశానికి చెందిన ఫుట్‌బాల్‌ ఆటగాడు 'యాయా టౌరే' నెట్టింట వైరల్‌ అవుతున్నాడు.  అందుకు ప్రధాన కారణం మహేష్‌ బాబు అతడు సినిమానే కావడం విశేషం.  వివిధ మ్యాచ్‌లలో ఆయన చేసిన గోల్స్‌ ఒక వీడియోగా క్రియేట్‌ చేసి దానికి అతడు సినిమా బిజీఎమ్‌ను జోడించారు. ఆపై ఆడు మగాడ్రా బుజ్జి అంటూ తనికెళ్ల భరణి చెప్పే ఎలివేషన్‌ డైలాగ్స్‌ను కూడా మిక్స్‌ చేశారు. అయితే, ఆ వీడియోను చిన్నాచితక పేజీ షేర్‌ చేయలేదు.  ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ఫుట్‌బాల్ జ‌ట్టు మాంచెస్టర్ సిటీ (ఇంగ్లాండ్‌) తన  ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 'పెను తుఫాను తలొంచి చూసే… తొలి నిప్పు కణం అతడే ' అంటూ తెలుగు డైలాగ్‌ను కూడా షేర్‌ చేసింది.  56 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్న ఆ పేజీలో ఒక తెలుగు సినిమాకు చెందిన బీజీఎమ్‌తో పాటు అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన డైలాగ్స్‌ చేర్చడం విశేషం.

ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ ఫుట్‌బాల్ జ‌ట్టుగా పేరుగాంచిన మాంచెస్టర్ సిటీ(Manchester City).. ప్ర‌తిష్ఠాత్మ‌కమైన ఫిఫా క్ల‌బ్ వ‌ర‌ల్డ్ క‌ప్(FIFA Club World Cup)- 2023 చాంపియ‌న్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ టీమ్‌కు చెందిన సోషల్‌మీడియా పేజీలో టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు సినిమాకు సంబంధించిన డైలాగ్స్‌ను పంచుకోవడం గొప్ప విషయం. ఇప్పటికే ఆ వీడియో  ఒక మిలియన్‌ వ్యూస్‌ చేరుకుంది.

మాంచెస్టర్ సిటీ షేర్‌ చేసిన వీడియోలో యాయా టౌరే కొడుతున్న గోల్స్‌కు తనికెళ్ల భరణి డైలాగ్స్‌ జత కావడంతో ట్రెండ్‌ అవుతుంది. యాయా టౌరే ప్రస్తుతం సౌదీ అరేబియా జాతీయ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు .

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)