Breaking News

500 మంది డ్యాన్సర్స్‌తో చిరు, వెంకీ డ్యాన్స్‌

Published on Mon, 12/01/2025 - 00:03

చిరంజీవి, వెంకటేశ్‌ కలిసి చేస్తున్న సెలబ్రేషన్‌ సాంగ్‌ చిత్రీకరణ మొదలైంది. చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేశ్, క్యాథరిన్, వీటీవీ గణేశ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్‌లో జరుగుతోంది. చిరంజీవి, వెంకటేశ్‌తోపాటు 500 మందికి పైగా డ్యాన్సర్స్‌పాల్గొంటుండగా ఓ స్టైలిష్‌ మాస్‌ డ్యాన్స్‌ సాంగ్‌ షూట్‌ను ఆరంభించారు.

సంగీతదర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో స్వరపరచిన ఈపాటకు పొలకి విజయ్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ‘‘చిరంజీవి, వెంకటేశ్‌ కలిసి చేస్తున్న ఈపాట ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు అసలు సిసలైన విందులా ఉంటుంది. అలాగే చిరంజీవి–నయనతారలపై చిత్రీకరించిన ఓ మెలోడియస్‌ రొమాంటిక్‌ సాంగ్‌ను త్వరలోనే రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ తెలిపింది. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.  

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)