మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
అసభ్యకర మెసేజ్‌లతో నటికి వేధింపులు.. సహజీవనం చేయాలని ఒత్తిడి
Published on Wed, 07/27/2022 - 20:26
సాక్షి, హైదరాబాద్: తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా అసభ్య మెసేజ్ పంపతూ.. తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ నటి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. అమీర్‌పేట, నాగార్జునానగర్ కాలనీలో ఉంటున్న నటి (42) కు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రవీణ్ పదిహేనేళ్లుగా పరిచయం. ప్రవీణ్ భవనాలు నిర్మించే బిల్డర్. 8 ఏళ్ల క్రితం ఆమె వద్ద రూ. 47 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
బాధితురాలు అపార్ట్‌మెంట్‌లో ఉండే మరో మహిళ వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకుని ప్రవీణ్‌కు ఇచ్చింది. తన డబ్బులు తనకు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ప్రేమ పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, ప్రాణాలతో బయటపడిన చిన్నారి
Tags : 1