Breaking News

చివరి శ్వాస వరకు సినిమాల్లో ఉంటా.. కానీ నన్ను గుర్తుంచుకోరు: మమ్ముట్టి

Published on Wed, 05/29/2024 - 17:02

మలయాళ స్టార్, మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మమ్ముట్టి. తెలుగులోనూ స్టార్‌ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల యాక్షన్-థ్రిల్లర్ 'టర్బో'చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి, సునీల్, అంజనా జయప్రకాష్, కబీర్ దుహన్ సింగ్, సిద్ధిక్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూకు హాజరైన మమ్ముట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన చివరి శ్వాస వరకు సినిమాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.

మమ్ముట్టి మాట్లాడుతూ..'నా చివరి శ్వాస వరకు నటనను విడిచిపెట్టే ఆలోచనే లేదు. నా మరణం తర్వాత ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారని ఆశించడం లేదు. ఎందుకంటే కాలక్రమేణా గొప్ప వ్యక్తులను కూడా ఎవరైనా మరచిపోతారనే విషయాన్ని గట్టిగా నమ్ముతా. అయినా ప్రజలు నన్ను ఎంతకాలం గుర్తుంచుకుంటారు? ఒక సంవత్సరం? పదేళ్లు? అంతకంటే చాలా తక్కువ. చాలా కొద్ది మంది మాత్రమే గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వేలమంది నటీనటుల్లో నేను ఒక్కడిని." అని అన్నారు.

వారు నన్ను ఏడాది కంటే ఎక్కువ కాలం ఎలా గుర్తుంచుకోగలరు? మనం ఈ ప్రపంచంలో లేనప్పుడు మన గురించి ఎలా తెలుస్తుంది? ప్రపంచం అంతం అయ్యే వరకు అందరూ గుర్తుంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ జరగదు' అని అన్నారు. కాగా.. తన నటనతో ఇప్పటివరకు మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 1971లో ఇండస్ట్రీలో ప్రవేశించిన మమ్ముట్టి 400కు పైగా చిత్రాలలో నటించారు. 1973లో వచ్చిన ‘కాలచక్రం’లో సినిమాతో గుర్తింపు పొందారు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)