Breaking News

మమ్ముట్టికి మైల్‌స్టోన్‌ చిత్రంగా 'కన్నూర్ స్క్వాడ్'.. కథ ఏంటంటే?

Published on Sun, 11/05/2023 - 16:14

శాండిల్‌వుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తాజాగా విడుదల చేసిన 'కన్నూర్ స్క్వాడ్' 100 కోట్ల క్లబ్‌లో చేరింది. సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మమ్ముట్టి నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ ఏడాది మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన చిత్రంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను కూడా మమ్ముట్టి సంస్థ షేర్ చేసింది. 100 కోట్ల క్లబ్‌లో చేరిన మమ్ముట్టికి ‘కన్నూర్ స్క్వాడ్’ నాలుగో చిత్రం.

(ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌.. టేస్టీ తేజకు రిటర్న్‌ గిఫ్ట్‌.. సందీప్‌ పోస్ట్‌ వైరల్‌)

గతంలో 'భీష్మ పర్వం', 'మధురరాజా', 'మామాంగమ్' చిత్రాలు కూడా మమ్ముట్టి 100 కోట్ల క్లబ్‌లో చేరిన మలయాళ సినిమాలు. ‘కన్నూర్ స్క్వాడ్’ చిత్రం విడుదలైన రోజు నుంచి థియేటర్లలో మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికీ కూడా వీకెండ్‌లో కలెక్షన్స్‌ ఏ మాత్రం తగ్గలేదు. 'కన్నూర్ స్క్వాడ్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా 50 కోట్ల క్లబ్‌లో చేరి మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. 'కన్నూర్ స్క్వాడ్' కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లు వసూలు చేసింది.

మలయాళ స్టార్‌ దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమా విజయాన్ని అభినందించారు. ‘కన్నూర్ స్క్వాడ్’ చూనిట్‌ సభ్యులందరికీ సోషల్‌ మీడియా ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలిపాడు. ఈ చిత్రంపై  చూపిన అంతులేని ప్రేమకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.

కథ ఏంటి..?
కేర‌ళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో క‌న్నూర్ స్క్వాడ్‌ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంత‌టి క్లిష్ట‌త‌ర‌మైన కేసునైనా త‌మ ధైర్య‌సాహ‌సాల‌తో సాల్వ్ చేస్తుంటారు. అలాంటి టీమ్‌కు సవాల్‌గా పొలిటిషియ‌న్ దారుణ హ‌త్య‌కు సంబంధించిన కేసు వస్తుంది. ఈ కేసును ప‌ది రోజుల్లో సాల్వ్ చేయాల‌ని పోలీసుల‌ను హోమ్ మినిస్ట‌ర్ ఆదేశిస్తాడు.

ఎలాంటి ఆదారాలు లేని ఈ క్రైమ్‌ను క‌న్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ మ‌ర్డ‌ర్ చేసింది ఎవ‌రు? ఆ క్రిమిన‌ల్స్‌ను ప‌ట్టుకోవ‌డానికి కేర‌ళ నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వ‌ర‌కు క‌న్నూర్ స్క్వాడ్‌ టీమ్ ఎలా ప్ర‌యాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన క‌న్నూర్ స్క్వాడ్‌ టీమ్‌పై లంచ‌గొండిగా ఎందుకు ముద్ర‌ప‌డింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన క‌న్నూర్ స్వ్కాడ్ టీమ్ త‌మ ప్రాణాల‌ను ద‌క్కించుకోవ‌డానికి ఎలాంటి పోరాటం చేశారు అన్న‌దే ఈ సినిమా.. క‌న్నూర్ స్క్వాడ్‌ సినిమా చాలా వ‌ర‌కు కార్తీ 'ఖాకీ' సినిమాను గుర్తుకుతెస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)