Breaking News

మాజీ భార్య వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటుడు

Published on Sun, 03/16/2025 - 16:52

ప్రముఖ మలయాళ నటుడు, డైరెక్టర్ బాలా పోలీసులను ఆశ్రయించారు. తన మాజీ భార్య ఎలిజబెత్ ఉదయన్‌ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన భార్య కోకిలపై యూట్యూబర్ అజు అలెక్స్‌తో కలిసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కంప్లైంట్ ఇచ్చారు. ఎలిజబెత్ తనను రూ. 50 లక్షలు డిమాండ్ చేసిందని పోలీసులకు వివరించారు. ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతోనే తనపై విష ప్రచారం చేస్తోందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని నటుడు  బాల ఆరోపిస్తున్నారు. యూట్యూబర్ అజు అలెక్స్ ఛానెల్‌లో తనపై అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించారని బాల తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సెప్టెంబర్ 8, 2023లోనే ఎలిజబెత్‌తో తాను విడిపోయినట్లు బాలా పోలీసులకు వెల్లడించారు. కేవలం డబ్బు కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బాలా మండిపడ్డారు.

ఫిర్యాదు అనంతరం బాలా మీడియాతో మాట్లాడుతూ..' కొందరు సోషల్ మీడియా ద్వారా నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఇదో వెబ్ సిరీస్‌లా సాగుతోంది. నేనేమైనా రేపిస్టునా?, ఒక మహిళపై ఏడాదిన్నర పాటు అత్యాచారం ఎలా చేయగలను? నాకు ఇప్పటికే సర్జరీ జరిగింది. నా శస్త్రచికిత్స సమయంలో ఎలిజబెత్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఏడాదిన్నర తర్వాత వచ్చి ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది' అని బాల అన్నారు. ఓ వ్యక్తితో కలిసి ఆమె తమపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన భార్య కోకిల మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని వాపోయారు.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)