Breaking News

రాజమౌళి సినిమాలో నటించాలన్నది నా కల: హీరోయిన్‌

Published on Fri, 07/05/2024 - 10:47

రాజ్‌ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా నటించిన చిత్రం ‘తిరగబడర సామీ’. ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌. స్టడీస్‌ కోసం ముంబై వెళ్లి, థియేటర్‌ ఆర్ట్స్‌లో చేరాను. తెలుగులో నేను నటించిన తొలి సినిమా ‘తిరగబడర సామీ’. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ ఆసక్తికరంగా ఉంటుంది. అమ్మాయిలు సెల్ఫ్‌ డిఫెన్స్‌ నేర్చుకోవాలని నా క్యారెక్టర్‌ చెబుతుంది. నేను రియల్‌ లైఫ్‌లో ఎమ్‌ఎమ్‌ఏ (మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌) నేర్చుకున్నాను. 

అందుకే ఈ సినిమాలో నా పాత్రకు ఉన్న యాక్షన్‌ సీక్వెన్స్‌ని ఈజీగా చేశాను. రాజ్‌ తరుణ్‌గారి పాత్ర సైలెంట్‌గా మొదలై వైలెంట్‌గా మారుతుంది. ఎందుకు అనేది సినిమాలో చూడాలి. లవ్, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్‌... ఇలా అన్ని అంశాలు మిళితమైన  ‘తిరగబడరా సామీ’ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. 

ఇంకా మాట్లాడుతూ– ‘‘తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేశాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత తెలుగు పరిశ్రమ గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తెలుగులో నేనూ భాగమైనందుకు హ్యాపీగా ఉంది. రాజమౌళిగారి సినిమాలో నటించాలన్నది నా కల. అలాగే మణిరత్నంగారన్నా చాలా అభిమానం. హీరోల్లో మహేశ్‌బాబు, నాని, అడివి శేష్‌గార్లంటే ఇష్టం. నా తర్వాతి సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)