Breaking News

నా జీవితంలో మరిచిపోలేని బహుమతి ఇదే: మోహన్ లాల్ ఎమోషనల్ పోస్ట్

Published on Sun, 04/20/2025 - 17:28

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇటీవల ఎల్‌2 ఎంపురాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్ం బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలోనే ‍అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఎల్‌2 ఎంపురాన్ నిలిచింది.

అయితే సినిమాల పరంగా సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ దక్షిణాదితో పాటు నార్త్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ‍‍అలా సినిమా హీరోలకు అభిమానులు ఉండడం సహజం. కానీ అదే సినిమా హీరో మరొకరికి ‍అభిమాని అయితే ఎలా ఉంటుంది. సినీ పరిశ్రమలో స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న మోహన్‌ లాల్‌ కూడా ఓ వ్యక్తికి వీరాభిమాని. అతనెవరో కాదు.. ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్.. అర్జెంటీనా స్టార్‌ లియోనెల్‌ మెస్సి. అతనంటే మోహన్‌లాల్‌కు విపరీతమైన అభిమానం. అంతలా అభిమానించే లియోనాల్ మెస్సి.. మోహన్‌లాల్‌కు అరుదైన కానుకను పంపించారు. తాను సిగ్నేచర్ ‍చేసిన జెర్సీని మోహన్‌లాల్‌కు బహుమతిగా పంపారు. ఈ విషయాన్ని మోహన్ లాల్ తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.

మోహన్‌లాల్‌ ట్విటర్‌లో రాస్తూ..' జీవితంలోని కొన్ని క్షణాలు మాటల్లో చెప్పలేనివిగా అనిపిస్తాయి. అవీ ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఈ రోజు నేను అలాంటి క్షణాలనే అనుభవించాను. నా బహుమతిని చూసినప్పుడు నా హదయం ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. లెజెండ్ లియోనెల్ మెస్సీ సంతకం చేసిన జెర్సీ... అందులో నా పేరు, అతని చేతులతో రాసినది.  మెస్సీని చాలా కాలంగా మెస్సీని అభిమానించే వ్యక్తికి ఇది నిజంగా ప్రత్యేకమైనదే. డాక్టర్ రాజీవ్ మంగొట్టిల్, రాజేష్ ఫిలిప్ అనే ఇద్దరు ప్రియమైన స్నేహితుల లేకుండా ఈ అపురూపమైన క్షణం సాధ్యమయ్యేది కాదు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా జీవితంలో అన్నింటికంటే  మరపురాని ఈ బహుమతికి ధన్యవాదాలు' అని పోస్ట్ చేశారు. కాగా.. మోహన్ లాల్ ప్రస్తుతం ఆయన తుడరుమ్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 25న ఇది విడుదల కానుంది.
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)