OTT: మలయాళ మూవీ ‘గోళం’ రివ్యూ

Published on Sun, 08/25/2024 - 10:09

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘గోళం’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ప్రపంచంలో ఎన్ని కథలు ఉన్నాయని అడిగితే... ప్రపంచ జనాభా ఎంతమంది ఉంటే అన్ని కథలు ఉన్నాయన్నట్టు... ప్రతి వ్యక్తికి సంబంధించిన జీవితం ఓ సినిమా కథే.  కాకపోతే ఆ కథలను ఎంచుకోవడంలోనే ఉంటుంది అసలు ఆయువుపట్టు.  ఈ విషయంలో మలయాళ దర్శకులు చాలా ముందుంటారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ వేదికగా వస్తున్న పలు చిత్రాలు మలయాళ దర్శకుల ఆలోచనా పటిమకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాటిలో ‘గోళం’ ఒకటి. సమ్జాద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ  క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రకథ ఆయువు పట్టును చివరి వరకూ ప్రేక్షకులు కనిపెట్టలేరు. అంతగా రక్తి కట్టించే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని కట్టిపడేస్తుందీ సినిమా. 

ఈ చిత్రకథ విషయానికొస్తే... ఓ ఆఫీసులో బాస్‌ అనుకోకుండా బాత్రూంలో చనిపోయినపుడు ఆఫీసులో స్టాఫ్‌ తప్ప ఇంకెవరూ ఉండరు. దీనిని ఇన్వెస్టిగేట్‌ చేయడానికి సందీప్‌ కృష్ట తన టీమ్‌తో ఆఫీస్‌కు వస్తాడు. డే టైమ్‌ ఆఫీసులో బాస్‌ ఎలా చనిపోయాడు? హంతకుడు ఎవరు? ఇదే ‘గోళం’ సినిమా. ఇన్వెస్టిగేషన్‌ ఊహకందని ట్విస్టులతో, ఊహించని క్లైమాక్స్‌తో సాగుతుందీ సినిమా. ఆద్యంతం రక్తి కట్టే ఈ సినిమా చూశాక నేటి ఆఫీసుల్లో రిజిష్టర్‌ పంచ్‌ వేసేందుకు ఉపయోగించే మెషీన్‌ను చూడడానికి కూడా భయపడవచ్చు. ఎందుకో ఏమిటో ప్రైమ్‌ ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్న ‘గోళం’ చూసేయండి. ‘గోళం’... వర్త్‌ టు వాచ్‌ ఇట్‌.
– ఇంటూరు హరికృష్ణ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)