Breaking News

'జాతీయ అవార్డులకు విలువ లేదు'.. ది కేరళ స్టోరీకి రావడంపై డైరెక్టర్ అసహనం

Published on Thu, 08/07/2025 - 17:11

ఇటీవల ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై ప్రముఖ మలయాళ దర్శకుడు జెయో బేబీ స్పందించారు. ఆదా శర్మ కీలక పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ చిత్రానికి రెండు అవార్డులు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ది కేరళ స్టోరీ చిత్రం వాస్తవాలను తప్పుగా చూపించడమే కాకుండా.. స్క్రిప్ట్, దర్శకత్వం, నటన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఆయన ఆరోపించారు. ఇలాంటి సినిమాలకు అవార్డుల ప్రకటించడం వాటి విలువను తగ్గించనట్లే అవుతుందని అన్నారు. తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన ఆయన నేషనల్ అవార్డ్స్పై కామెంట్స్ చేశారు.

జెయో బేబీ మాట్లాడుతూ.. "అధికార పార్టీల ఎజెండాకు మద్దతు ఇచ్చే చిత్రాలకు జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. గత పదేళ్లుగా మనం ఈ పద్ధతిని చూస్తున్నాం. ఇలాంటి స్క్రిప్ట్‌లను ప్రోత్సహిస్తున్నందున ఈ అవార్డులకు ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా పోతోంది. సినిమాలను మెరిట్‌తో పరిగణించలేనప్పుడు ఈ అవార్డులు ఎందుకు?' అని ప్రశ్నించారు.

వాస్తవాలను తప్పుగా చిత్రీకరించిన 'ది కేరళ స్టోరీ' చిత్రానికి అవార్డులు ప్రకటించడం తనను తీవ్రంగా నిరాశ పరిచిందన్నారు. ఈ చిత్రం అంతా అసత్యాలే చూపించారని ఆరోపించారు. మూవీ స్క్రిప్ట్, దర్శకత్వం, నటన కూడా అంతగా ప్రేక్షకులను మెప్పించలేదన్నారు. కాగా..71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఆగస్టు 1, 2025న ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా మలయాళ దర్శకుడైన జెయో బేబీ.. ది గ్రేట్ ఇండియన్ కిటెన్, కాతల్ - ది కోర్, ఫ్రీడమ్ ఫైట్. శ్రీధన్య క్యాటరింగ్ సర్వీస్, కుంజు దైవం లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మరోవైవు ది కేరళ స్టోరీ రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ దర్శకత్వంతో పాటు ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డ్స్ సాధించింది. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ది గోట్ లైఫ్' చిత్రాన్ని జ్యూరీ తిరస్కరించడం పట్ల మలయాళ దర్శకుడు బ్లెస్సీ కూడా నిరాశ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు