Breaking News

హీరోయిన్ బీచ్‌ ఫోటోషూట్.. యూట్యూబ్ ఛానెల్‌కు నటి స్ట్రాంగ్ వార్నింగ్!

Published on Tue, 02/11/2025 - 18:15

ప్రముఖ మలయాళ నటి పార్వతి ఆర్ కృష్ణ అలాంటి వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో తన ఫోటోలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇటీవల తన ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను కొందరు యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులు మిస్‌యూజ్‌ చేయడంపై ఆమె స్పందించింది. తనకు సంబంధించిన  గ్లామరస్ ఫోటోషూట్ చిత్రాలను ‍అసభ్యకరమైన రీతిలో ప్రదర్శిస్తే చర్యలు తప్పవని వెల్లడించింది. ఈ విషయంపై ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.

వీడియోలో పార్వతి ఆ కృష్ణ మాట్లాడుతూ.. 'నాపై వచ్చిన ఒక తీవ్రమైన సమస్యపై మాట్లాడేందుకుందుకే ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నా. నా వృత్తిలో భాగంగా నేను తరచుగా ఫోటోషూట్‌లలో పాల్గొంటాను. ఎక్కడైనా కానీ నా అందాన్ని ప్రదర్శించడంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నా బీచ్ ఫోటోషూట్ సమయంలోనూ ఎక్కడ కూడా హద్దులు మీరి అందాలను ప్రదర్శించలేదు. కానీ యూట్యూబ్ ఛానెల్ వాళ్లు మాత్రం నా ఫోటోలను వారికిష్టమొచ్చినట్లు ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. నా అనుమతి లేకుండా నా వీడియోలు, చిత్రాలను అసభ్యంగా చూపిస్తే మీ ఛానెల్ మూసేవరకు పోరాటం చేస్తా.  ఇలాంటి సమస్యలపై ఇతరులు ఎందుకు స్పందించలేదో నాకు అర్థం కావడం లేదు. నా ఫోటోలను దుర్వినియోగం చేసేవారు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. నా వ్యక్తిగత జీవితంలోకి మీరు అడుగుపెడితే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూస్తారు'  అంటూ హెచ్చరించింది  నటి. కాగా.. పార్వతి ఆర్ కృష్ణ పలు మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)