Breaking News

మలయాళ ఇండస్ట్రీలో మరో కుదుపు.. ఒకేసారి 17 మంది రాజీనామా

Published on Tue, 08/27/2024 - 21:12

మలయాళ  సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ రీసెంట్‌గా ఓ నివేదిక సమర్పించింది. ఇందులో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మలయాళ సినిమాల్లో పనిచేసే మహిళలు.. క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఈ వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది. తాజాగా మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ముకుమ్మడి రాజీనామా చేశారు.

(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న 'ప్రేమలు' నటుడు)

అధ్యక్షుడిగా ఉ‍న్న ప్రముఖ నటుడు మోహన్ లాల్ తొలుత రాజీనామా చేయగా.. పాలక మండలిలోని మిగిలిన సభ్యులందరూ ఇదే ఫాలో అయిపోయారు. ఈ మేరకు 'అమ్మ'  సంఘం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడమే దీనికి కారణం. దీంతో వీళ్లంతా నైతిక బాధ్యతగా రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. అలానే రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి, కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.

అమ్మ సంఘంలో నటులు జగదీశ్‌, జయన్‌ చేర్తలా, బాబురాజ్‌, కళాభవన్‌ షాజన్‌, సూరజ్‌ వెంజారమూడు, టొవినో థామస్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు. తాజాగా జస్టిస్‌ హేమ కమిటీ షాకింగ్‌ నివేదిక విడుదల చేసిన అనంతరం.. దర్శకుడు రంజిత్‌, నటులు సిద్ధిఖీ, బాబురాజ్‌, జయసూర్య, ముకేశ్‌, సూరజ్‌ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో మలయాళ చిత్రసీమలో ప్రస్తుతం గందరగోళ వాతావరణం నెలకొంది.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)