నటుడిపై మాజీ భార్య తీవ్ర ఆరోపణలు.. ఇక ఆపేయాలంటూ వార్నింగ్!

Published on Mon, 03/17/2025 - 16:56

మాజీ భార్య తనను వేధింపులకు గురి చేస్తోందంటూ ప్రముఖ మలయాళ నటుడు బాలా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెతో పాటు మరో యూట్యూబర్‌పై కొచ్చి పోలీసులను ఆశ్రయించారు. అయితే అతని మాజీ భార్య ఎలిజబెత్ ఉదయన్‌ నటుడిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. తనను బాలా వేధించడంతో పాటు  అత్యాచారం చేశాడంటూ ఎలిజబెత్ ఉదయన్‌ సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. తాజాగా ఈ వివాదంపై నటుడు బాలా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ విషయంపై మాట్లాడుతూ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు. అంతకుముందే నటుడి భార్య  కోకిల సైతం తన భర్తపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎలిజబెత్‌ను కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

బాలా వీడియోలో మాట్లాడుతూ.."దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. ఈ వివాదంపై ఇది నా చివరి వీడియో కావాలని కోరుకుంటున్నా. ప్రియమైన ఎలిజబెత్.. మీ కుటుంబం పట్ల నాకు గౌరవం ఉంది. ప్రస్తుతం మీరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఇప్పుడు మీకు కావాల్సింది సోషల్ మీడియా అటెన్షన్ కాదు.. ఈ సమయంలో మీకు వైద్యం చాలా అవసరం. మీ కుటుంబంలో ఎవరైనా డాక్టర్‌ ఉన్నట్లయితే  సరైన వైద్యం తీసుకోండి. లేదంటే మీ సోదరులు, తల్లిదండ్రులతో కలిసి వైద్యుని వద్దకు కెళ్లండి. తనపై తప్పుడు ప్రచారం మానేయండి. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకండి. లేని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వెనుకాడను' అంటూ పోస్ట్ చేశారు.

కాగా.. నటుడు బాలా..  డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్‌ను 2021లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మనస్పర్థలు రావడంతో ఈ జంట విడిపోయారు. అయితే ఈ విషయంలో కొందరు ఎలిజబెత్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు. మీవల్లే ఎలిజబెత్ ‍‍అలా ప్రవర్తిస్తోందని నటుడు బాలాపై కొందరు విమర్శలు చేస్తున్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)