Breaking News

ఆడిషన్‌కు వెళ్తే గదిలో నాతో అసభ్యంగా.. ఏడ్చినా వినలేదు: నటి

Published on Wed, 04/12/2023 - 20:33

తాను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలిననే పేర్కొంది మాళవిక శ్రీనాథ్‌. మూడేళ్ల క్రితం ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది మలయాళ నటి.  'మూడేళ్ల క్రితం ఇది జరిగింది. మంజు వారియర్‌ సినిమాలో ఆమె కూతురిగా నటించాలంటూ ఓ ఆఫర్‌ వచ్చింది. మంజు వారియర్‌ మూవీ అనగానే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. అందుకే ఆలస్యం చేయకుండా ఓకే చెప్పాను. త్రిస్సూర్‌లో ఆడిషన్‌కు వెళ్లాం. గాజు గ్లాసుతో ఉన్న గదిలో ఆడిషన్‌ జరిగింది. ఆ తర్వాత నా జుట్టంతా చిందరవందరగా ఉందని డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి సరిచేసుకోమని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు.

సరేనని నేను ఆ గదిలోకి వెళ్లగానే అతడు నన్ను వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కసారిగా షాక్‌ అయిన నేను తన నుంచి విడిపించుకునేందుకు చాలా ప్రయత్నించాను. నువ్వు మంజు వారియర్‌ కూతురిగా స్క్రీన్‌పై కనిపించాలంటే సైలెంట్‌గా ఉండు అని చెప్పాడు. నేను ఏడుస్తూ తన చేతిలో ఉన్న కెమెరాను పగలగొట్టేందుకు ప్రయత్నించాను. అతడు దాన్ని సరిచేసుకునే క్రమంలో వెంటనే అక్కడి నుంచి పారిపోయాను' అని చెప్పుకొచ్చింది. కాగా మాళవిక.. మధురం, సాటర్‌డే నైట్‌ వంటి చిత్రాలు చేసింది.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)