Breaking News

మేకప్‌కే నాలుగు గంటలు.. శరీరంపై దద్దుర్లు వచ్చాయి: ‘తంగలాన్‌’ హీరోయిన్‌

Published on Wed, 07/24/2024 - 16:42

విక్రమ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్‌’. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌) కార్మికుల జీవితాల ఆధారంగా పా.రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాళవిక మోహనన్‌, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. హీరోహీరోయిన్లతో వరుస ఇంటర్వ్యూలు ఇప్పిస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా మాళవికా మోహనన్‌, పార్వతి తిరువోతు ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. 

(చదవండి: విజయ్‌ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ)

ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ.. ‘తంగలాన్‌’ నా జీవితంలో మర్చిపోలేని సినిమా. ఈ చిత్రంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను మేకప్‌ వేసుకోవడానికే దాదాపు నాలుగు గంటల సమయం పట్టేది. ఎక్కువగా ఎండలోనే షూటింగ్‌ చేశాం. దాని కారణంగా నా  శరీరంపై దద్దుర్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి.  రోజూ సెట్స్‌లో డెర్మటాలజిస్ట్‌, కళ్ల డాక్టర్‌.. ఇలా మొత్తం ఐదుగురు డాక్టర్లు ఉండేవారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని అన్నారు. 

పార్వతి తిరువోతు  మాట్లాడుతూ..  ‘పా.రంజిత్‌ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. తంగలాన్‌ లో నాది గంగమ్మ అనే కీలక పాత్ర. ఈ పాత్ర కోసం ఎంతో శ్రమించా. భాషపరంగా కసరత్తు చేశా’ అని తెలిపారు. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. ఏ రంగంలో అడుగుపెట్టేవారని ఓ విలేకరి ప్రశ్నించగా.. టీ షాపు పెట్టేదాన్ని అని సమాధానం ఇచ్చింది పార్వతి. ‘వృత్తి ఏదైనా సరే మరాద్య, గౌరవంతో పని చేయాలనుకున్నాను. నాకు టీ అంటే చాలా ఇష్టం. టీ చక్కగా పెట్టగలను. అందుకే ఒకవేళ నటిని కాకపోయి ఉంటే..కచ్చితంగా ఓ టీ షాపు పెట్టేదాన్ని’అని పార్వతి చెప్పుకొచ్చింది. తనకు విజువల్‌ ఆర్ట్స్‌ అంటే చాలా ఇష్టమని, ఒకవేళ తాను నటి కాకపోయి ఉంటే ఫొటోగ్రఫీ, లేదా సినిమాటోగ్రఫీ రంగంలోకి వెళ్లేదాన్ని  అని పార్వతి బదులిచ్చింది.

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)