Breaking News

ప్రభాస్ ఫుడ్‌కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?

Published on Mon, 08/05/2024 - 13:05

ప్రభాస్ పేరు చెప్పగానే పాన్ ఇండియా సినిమాలు, వేల కోట్ల రూపాయల వసూళ్లు ఎలా గుర్తొస్తాయో.. అతడి అతిథ‍్యం, పెట్టే ఫుడ్ కూడా అలానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు స్టార్ హీరోయిన్లు డార్లింగ్ హీరో ఇచ్చే ఫుడ్ గురించి చాలాసార్లు చెప్పారు. వీళ్లలో శ్రద్ధా కపూర్, పూజా హెగ్డే, శ్రుతి హాసన్, కృతి సనన్, దీపికా పదుకొణె ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో ఆరో హీరోయిన్ చేరిపోయింది. ఆమెనే మాళవిక మోహనన్.

(ఇదీ చదవండి: యాంకర్‌ సుమకు స్టేజీపై ముద్దు పెట్టిన నటుడు)

కేరళకు చెందిన ఈ బ్యూటీ.. ఇప్పటివరకు తమిళ, మలయాళ సినిమాలు చేసింది. ఇన్ స్టాలో గ్లామర్ ఫొటోల వల్ల తెలుగోళ్లకు కాస్త పరిచయమే. ఈమె లీడ్ రోల్ చేసిన 'తంగలాన్'.. ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులోనే ప్రభాస్ ఫుడ్ గురించి మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

'హైదరాబాద్‌లోనే బెస్ట్ ఫుడ్ ప్రభాస్ నాకు పంపించారు. మా అమ్మ ఫుడ్ తర్వాత నేను ఇప్పటివరకు తిన్న వాటిలో బెస్ట్ అంటే ప్రభాస్ సర్ పంపించిందే. దాదాపు మా అమ్మ వండిన వంటలానే అనిపించింది' అని మాళవిక చెప్పింది. 'రాజాసాబ్' సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ రావడం చాలా గ్రేట్. ఆ పాత్ర అంత అద్భుతంగా ఉంటుంది. మీరంతా రాజా సాబ్ చూడటం కోసం ఎదురుచూస్తున్నానని తన ఆనందాన్ని బయటపెట్టింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్‌)

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)