Breaking News

నటుడితో కాఫీ కోసం నాయకురాలు లేఖ.. రిప్లై ఇవ్వలేదట!

Published on Tue, 08/05/2025 - 13:33

రాజకీయ నాయకులు కూడా వినోదం కోసం సినిమా చూస్తుంటారు. వాళ్లకూ అభిమాన హీరోహీరోయిన్లు ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు తమ అభిమాన నటీనటులను కలుస్తుంటారు. కొంతమంది అయితే ఏ స్థాయిలో ఉన్నా.. తమ అభిమాన నటీనటులు కనిపిస్తే చాలు తమ హోదాని మరచి సాధారణ అభిమానిలాగే వ్యవహరిస్తారు. తాజాగా  పశ్చిమ బెంగాల్‌ ఎంపీ మహువా మొయిత్రా కూడా అలానే ప్రవర్తించారు. 

ఇండియా టుడే చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరేట్‌ నటుడి గురించి, అతన్ని కలిసేందుకు చేసిన ప్రయత్నాల గురించి చెబుతూ.. సిగ్గు పడిపోయింది. పార్లమెంట్‌లో జంకు లేకుంగా గంభీరంగా మాట్లాడుతూ ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న మహువా మొయిత్రా.. ఇలా సిగ్గు పడుతూ మాట్లాడడం చూసి వీక్షకులు అవాక్కయ్యారు. ఇంతకీ మహువా మనసుకు నచ్చిన నటుడి పేరు చెప్పలేదు కదా.. విలక్షణమైన పాత్రలు పోషిస్తూ బాలీవుడ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న పంకజ్‌ త్రిపాఠినే ఆమె ఫేవరేట్‌ యాక్టర్‌. అతనితో కలిసి కాఫీ తాగేందుకు చాలా ప్రయత్నాలు చేసిందట. చివరకు లేఖ కూడా రాశానని.. కానీ రిప్లై రాలేదని మహువా చెప్పుకొచ్చింది.

యాంకర్‌తో కబురు..
పంకజ్‌ త్రిపాఠి నటన అంటే నాకు చాలా ఇష్టం. బయట కూల్‌గా కనిపిస్తాడు కానీ తెరపై మాత్రం భయంకరమైన పాత్రల్లో కనిపిస్తాడు. మిర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌లో ఆయన అద్భుతమైన విలనిజం పండించాడు. ఒకసారి అతన్ని కలిసేందుకు ప్రయత్నించాడు. అతనితో కలిసి కాఫీ తాగాలని ఉందని లేఖ రాసి.. అతన్ని ఇంటర్వ్యూ చేయబోయే యాంకర్‌ ద్వారా ఆ లేఖని అందించాను. కానీ ఆయన నుంచి రిప్లై రాకపోవడంతో నిరాశ చెందాను.

సహచర ఎంపీ సహాయంతో..
ఎంపీ అయిన తర్వాత సహచర ఎంపీ, నటుడు రవి కిషన్‌తో నా క్రష్‌ గురించి చెప్పాను. పంకజ్‌ త్రిపాఠి నటన అంటే చాలా ఇష్టమని , ఇలా లేఖ కూడా రాశనని చెప్పాను. అతను వెంటనే ఫోన్‌ చేసి పంకజ్‌తో మాట్లాడించాడు. అతనితో మాట్లాడే సమయంలో తెలియకుండానే నేను సిగ్గుపడిపోయాను. లేఖ రాసిన విషయాన్ని కూడా గుర్తు చేశాను’ అని ఎంపీ మహువా మొయిత్రా చెప్పుకొచ్చింది.

పంకజ్‌ త్రిపాఠి విషయానికొస్తే.. 2004లో ఆయన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2012లో వచ్చిన  గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘మీర్జాపూర్‌’ వెబ్‌ సిరీస్‌తో అన్ని భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒకవైపు వెబ్‌ సిరీస్‌లు మరోవైపు సినిమాలు చేస్తూ బీజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. ఇటీవల ఆయన మైన్ హీరా అనే సినిమాలో ఒక హీరోగా కనిపించాడు.

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)