Breaking News

ఆ హీరోతో ఓ సినిమా చేశా.. అయినా నంబర్‌ బ్లాక్‌ చేశాడు: హీరోయిన్‌

Published on Wed, 04/10/2024 - 16:34

మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జై గణేష్'. ఈ సినిమాకు రంజిత్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురువారం థియేటర్లలో విడుదల కానుంది. వీరిద్దరు చివరిసారిగా 2017లో విడుదలైన'మాస్టర్‌పీస్' చిత్రంలో కనిపించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ సందర్భంగా హీరోయిన్ మహిమ నంబియాన్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మాస్టర్‌పీస్ చిత్రం తర్వాత ఉన్ని ముకుందన్‌ తన ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేశాడని తెలిపింది. జై గణేశ్ మూవీలో నటించేవరకు తనను అన్‌బ్లాక్ చేయలేదని కూడా ఆమె పేర్కొంది.

మహిమ నంబియార్ మాట్లాడుతూ..'ఉన్ని ముకుందన్ నంబర్ తీసుకోవడానికి స్క్రిప్ట్ రైటర్ ఉదయ్‌కృష్ణకి కాల్ చేశా. అతని వద్ద నుంచి ఉన్ని ముకుందన్ నంబర్‌ తీసుకుని వాట్సాప్‌లో వాయిస్ మేసేజ్ పంపా. నేను మహిమను. నేనెవరో నీకు తెలుసు అనుకుంటున్నా. ఉదయన్ నీ నంబర్ ఇచ్చాడని చెబుతూనే ఉదయన్ అనే పదాన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేశా. దీంతో ఉన్ని నా వాయిస్ మేసేజ్ విని  బ్లాక్ చేశాడు. కానీ ఉన్ని ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదు.  ఆ తర్వాత ఉన్ని ఉదయన్‌కి ఫోన్ చేశాడు. ఆమె చాలా అహంకారి. ఆమె మిమ్మల్ని ఉదయన్ అని పిలుస్తోంది. సీనియర్‌ని ఇలాగేనా పిలిచేది అన్నాడట. దీంతో ఏడేళ్లుగా  నా నంబర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేశాడు' అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

తాజాగా ఉన్ని ముకుందన్ ఈ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో కోపంతో తన నంబర్‌ను బ్లాక్‌ చేశానని వెల్లడించారు. ఆ తర్వాత బ్లాక్ చేసిన సంగతే మరిచిపోయినట్లు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత మహిమ ఆర్డీఎక్స్‌లో నటించి హిట్‌ కొట్టినప్పుడు చూశాను. ఆ తర్వాత రంజిత్‌ శంకర్‌ సినిమాలో మహిమ హీరోయిన్‌గా నటిస్తుందని తెలిసింది. దీంతో వెంటనే ఆమె కాంటాక్ట్‌ని బ్లాక్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే అన్‌బ్లాక్ చేసి మెసేజ్ పంపాను.. నేను ఉన్నిని.. మీరు ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని' ఉన్ని ముకుందన్ అన్నారు. కాగా.. ఏడేళ్ల తర్వాత వీరిద్దరు జంటగా నటించిన జై గణేష్ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)