Breaking News

Yatra 2: తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టిన ఓ కొడుకు కథే ‘యాత్ర 2’

Published on Sat, 07/08/2023 - 15:14

‘కథను ఎంచుకునేటప్పుడు ఓ మేకర్‌గా కమర్షియల్ కోణంలో సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయా? లేదా? అన్నది ఆలోచిస్తాం. యాత్రలో ఓ రాజకీయ నాయకుడి తన గురించి తాను తెలుసుకోవడం, ప్రజల కష్టాలను తెలుసుకోవడం, ఆయన ఏంటన్నది ప్రజలు తెలుసుకోవడం ఉంటుంది. యాత్ర 2లో 2009 నుంచి 2019 వరకు జగన్ మోహన్ రెడ్డి గారి పీరియడ్‌ను చూపిస్తాను.  ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను’అని దర్శకుడు మహి వి. రాఘవ్‌ అన్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం యాత్ర 2.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి(జులై 8) సందర్భంగా నేడు యాత్ర 2 మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మహి వి.రాఘవ్‌ మీడియాతో మాట్లాడుతూ ముచ్చటించారు. ఆ విశేషాలు..

► తండ్రి  ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్ చుట్టూ  యాత్ర 2 కథ నడుస్తుంది.  సీఎం జగన్‌ ఎక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టారు.. ఎక్కడి వరకు ఎదిగారు అన్నదే ఈ సినిమాలో చూపిస్తున్నాం. యాత్రకి, యాత్ర 2కి కథ పరంగా ఏ సంబంధం ఉండదు.

► యథార్థ సంఘటనలే అయినా కూడా జనాలను ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు ఫిక్షన్ యాడ్ చేస్తాం. రెండు గంటల్లో కథను చెప్పాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేస్తాను.ఈ సినిమాతో ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకోవద్దు. సినిమా చూసి ఎమోషనల్ అవుతారు.. పోలింగ్ బూత్‌లో వాళ్లకు నచ్చిన వాళ్లకు ఓటు వేస్తారు.

► జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎత్తుపల్లాలున్నాయి. వాటినే సినిమాలో చూపిస్తాం. జగన్ అనే ఓ రాజకీయ నాయకుడి కథను చెప్పబోతోన్నాం

►  పొలిటికల్ సినిమాలు చేయడమే రిస్క్.. ఇలాంటి సినిమాలు ఎప్పుడు, ఏ టైంలో రిలీజ్ చేస్తామనేది ముఖ్యం. అందుకే ఎన్నికల టైంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం

► ఆర్జీవీ గారు తీసే వ్యూహం మాపై ఎలాంటి ప్రభావం చూపదు. త్వరలోనే నటీనటుల వివరాలను ప్రకటిస్తాం. శివ మేక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మధి సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాం.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి