క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘సైతాన్‌’ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడ?

Published on Sat, 06/03/2023 - 16:48

‘సేవ్‌ ద టైగర్స్‌’వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్‌ మహి వి. రాఘవ్‌. ఈ కామెడీ వెబ్‌ సిరీస్‌కి మహి క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌, షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.  ప్రతి ఇంట్లో భార్య భర్తల మధ్య జరిగే గొడవల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఇదే జోష్‌లో మరో వెబ్‌​ సిరీస్‌ని విడుదల చేయబోతున్నాడు మహి. అదే ‘సైతాన్‌’. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 

ఇప్పటి వరకు కామెడీ అండ్ ఎమోషనల్ కథలనే తెరకెక్కించిన మహి..ఇప్పుడు క్రైమ్‌ నేపథ్యంలో ‘సైతాన్‌’ని తెరకెక్కించడం విశేషం. ‘సైతాన్' ఫస్ట్ లుక్ చూస్తే... నలుగురు కలిసి  ఓ పోలీసును హత్య చేసినట్టు అర్థం అవుతోంది. ఎందుకు చంపారు? అనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది. 'మీరు నేరం అని దేనిని అయితే అంటున్నారో... వాళ్ళు దానిని మనుగడ కోసం చేసిన పనిగా చెబుతున్నారు'' అని మహి వి. రాఘవ్ పేర్కొన్నారు. క్రైమ్ జానర్ ప్రాజెక్ట్ చేయడం ఆయనకు ఇదే తొలిసారి. 

దేవయాని శర్మ, మ‌ల‌యాళీ న‌టి షెల్లీ నబు కుమార్, నటుడు రిషి, జాఫర్ సాధిక్ కీలక పాత్రలు పోషించిన ఈ  ఫుల్ లెంగ్త్ క్రైమ్ సిరీస్ ఈ నెల 15న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. 

Videos

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!

వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

Photos

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)