Breaking News

'వారణాసి' కథ సుఖాంతం.. 'స్పిరిట్' సంగతేంటి?

Published on Fri, 07/24/2026 - 13:00

రీసెంట్ టైంలో మహేశ్ బాబు 'వారణాసి', ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలు ఊహించని విధంగా ఒకే సమస్యలో చిక్కుకున్నాయి. వీటికి సంబంధించిన టైటిల్స్‌ని వేరే నిర్మాతలు కూడా తమ చిత్రాలకు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. అయితే వీటి విషయంలో మూవీ టీమ్స్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని అంతా అనుకున్నారు. అయితే 'వారణాసి' టైటిల్ వివాదం ముగిసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

ఇదివరకే 'వారణాసి' టైటిల్‌ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న నిర్మాత సుబ్బారెడ్డి.. ఈ పేరుపై హక్కులు తనకే ఉన్నప్పటికీ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రాజమౌళి-మహేశ్ ప్రాజెక్టుకి ఇచ్చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తన అభిమాన హీరో మహేశ్ బాబు చిత్రానికి టైటిల్ ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌ సమక్షంలో 'వారణాసి' సినిమా టైటిల్‌కి సంబంధించిన పత్రాల్ని నిర్మాత కె.ఎల్‌.నారాయణకు సుబ్బారెడ్డి ఇటీవల అందజేశారు.

అయితే ఈ చిత్ర టైటిల్ వివాదం ముగిసింది గానీ 'స్పిరిట్' విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. తెలుగులోనే ఇదే పేరుతో ఓ చిన్న సినిమాని కూడా తీశారు. అయితే తమకు నోటీసులు పంపించారని సదరు చిన్న నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మరి 'స్పిరిట్' టైటిల్ వివాదం ఎప్పుడు ముగుస్తుందో?

(ఇదీ చదవండి: ఏడాది కష్టపడ్డా.. 'జన నాయగన్'లో నా సీన్ తీసేశారు: తమిళ నటి)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)