గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేశ్ బాబు హీరోయిన్

Published on Sat, 07/27/2024 - 10:24

దేశంలోని చాలామంది బ్యూటీలతో పాటు విదేశీ భామలు ఎందరో టాలీవుడ్‌లో హీరోయిన్లుగా చేశారు. కాకపోతే ఈ ప్రయత్నంలో క్లిక్ అయి, స్టార్ హీరోయిన్లు అయినోళ్లు చాలా తక్కువమంది. కానీ ఎంతో అందంగా ఉన్న ముద్దుగుమ్మలు కూడా స్టార్ హీరోల సరసన నటించారు. కాకపోతే అదృష్టం కలిసి రాక కనుమరుగైపోయారు. ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి పరిస్థితి. ఇంతలా చెప్పాం కదా ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన కనిపిస్తున్న ఆమె పేరు లీసా రే. ఇప్పటికీ మీకు ఐడియా రాలేదు కదా! 'టక్కరి దొంగ' హీరోయిన్ అంటే బహుశా గుర్తుపడతారేమో? మహేశ్ బాబు కౌబాయ్ తరహా పాత్రలో నటించిన సినిమా అది. ఖర్చు బాగానే పెట్టారు గానీ తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఇదే మూవీలో మరో హీరోయిన్‌గా చేసిన బిపాసు బసు.. ఆ తర్వాత కాలంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోగా.. లీసా మాత్రం కొన్ని కారణాల వల్ల కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది.

(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?)

కెనడాకి చెందిన లీసారే.. హిందీ-బెంగాలీ ఫ్యామిలీలో పుట్టింది. మోడల్‌గా పలు యాడ్స్ చేసి, హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 1994 నుంచి 2019 వరకు 20కి పైగా సినిమాలు చేసింది. వీటిలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మూవీస్ ఉన్నాయి. ఇకపోతే 2009లో క్యాన్సర్ బారిన పడి కోలుకున్నాక లీసాకు అవకాశాలు తగ్గిపోయాయి. 2012లో జేసన్ డేన్హీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.

ప్రస్తుతం లీసా రేకు 52 ఏళ్లు. అయితేనేం మోడ్రన్ డ్రస్సుల్లో ఇంకా గ్లామరస్‌గానే ఉంది. కాకపోతే అప్పటితో పోలిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అయితే ఈమె మహేశ్ 'టక్కరిదొంగ' హీరోయిన్ అని తెలిసి మాత్రం చాలామంది అవాక్కవుతున్నారు.

(ఇదీ చదవండి: ప్రాక్టీస్‌లోనూ తమన్నా రొమాంటిక్ డ్యాన్స్.. ఒరిజినల్ కంటే ఇదే..!)

Videos

కుంటుతూ నామినేషన్ కు వచ్చిన TDP మహిళా నేత.. హఠాత్తుగా ఏం జరిగిందో చూడండి

కత్తిపూడిలో స్కార్పియో బీభత్సం.. నలుగురు మృతి

శ్రీకాళహస్తిలో హైటెన్షన్.. అడ్డుకున్న పోలీసులు.. ఇచ్చిపడేసిన బియ్యపు మధుసూదన్ రెడ్డి కూతురు

మహిళా అభ్యర్థి చీర లాగి.. రక్తం వచ్చేలా.. పొదిలిలో టీడీపీ కీచకపర్వం

కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్

అరె సుధీర్.. ఈ 2 సంవత్సరాలే... నేను గెలిచాక నీ అంతు చూశాకే ప్రమాణ స్వీకారం చేస్తా...

ఆ రోజు జగన్ సై అనుంటే...! ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి అనేవాడు.. పెద్దారెడ్డి సంచలన కామెంట్స్

ఆడంగి వెధవలు.. కర్రలు, రాళ్లు, బ్లేడ్లతో... సతీష్ రెడ్డి మాస్ వార్నింగ్

MP అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్! ఇంటి చుట్టూ ముళ్ల కంచె

ఓటమి పక్కా.. సుప్రీం కోర్టు చెంపదెబ్బలు.. అయినా ఆగని నారా గొడ్డలి అరాచకాలు

Photos

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై తగ్గని రద్దీ - ఎటు చూసినా భవానీలే (ఫొటోలు)

+5

జ్యోతి పూర్వజ్ ‘కిల్లర్‌’ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా మైసూరు దసరా వేడుకలు...జనసంద్రమైన ప్యాలెస్‌ సిటీ (ఫొటోలు)

+5

దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం (ఫొటోలు)

+5

చూపు తిప్పుకోనివ్వని భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

పండగ వేళ.. చీరకట్టుతో రుక్మిణి భళా (ఫొటోలు)

+5

'దొంగ నా కొడుకు' టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రేపే కివీస్‌తో తొలి టీ20.. నెట్స్‌లో టీమిండియా క‌ఠోర‌ సాధన (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 18 -అక్టోబర్ 24)

+5

బొమ్మలా అందంగా అదరగొట్టేస్తున్న గాయత్రి భరద్వాజ్ (ఫొటోలు)