మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!
Breaking News
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
సీక్వెల్స్ ఉన్నాయి!
Published on Tue, 01/03/2023 - 04:13
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇప్పటికే ఇది ‘యాక్షన్ అడ్వంచరస్’ మూవీ అని ఆయన పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి సీక్వెల్స్ ఉంటాయన్నారు.
ప్రధానపాత్రలు అలాగే ఉంటాయని, సీక్వెల్స్ కథ మారుతుంటుందని స్పష్టం చేశారాయన. ప్రస్తుతం తొలి భాగానికి సంబంధించిన కథను పూర్తి చేసే పని మీద ఉన్నారు విజయేంద్రప్రసాద్. ఇక మహేశ్ అద్భుత నటుడని, యాక్షన్ సీన్స్ బాగా చేస్తారని, ఏ రచయితకైనా ఆయనకు రాయడం బాగుంటుందని, ఈ చిత్రానికి హీరోగా తనే బెస్ట్ చాయిస్ అని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉంది.
#
Tags : 1