ఫారెస్ట్‌లో ఫైట్‌

Published on Thu, 03/06/2025 - 04:33

ఒడిశాలో ల్యాండ్‌ అయ్యారు మహేశ్‌బాబు. ఎందుకంటే సినిమా షూటింగ్‌ కోసం. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్‌ ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ కోసం చిత్రయూనిట్‌ ఒడిశాలోని కోరాపుట్‌  ప్రాంతానికి వెళ్లిందని తెలిసింది. దాదాపు ఇరవై రోజుల వరకు ఈ సినిమా చిత్రీకరణ అక్కడే జరుగుతుందని సమాచారం.

 గత ఏడాది డిసెంబరు నెల చివర్లో ఒడిశా వెళ్లి, అక్కడి ఫారెస్ట్‌ లొకేషన్స్‌ని రాజమౌళి పరిశీలించారు. బుధవారం ఒడిశా వెళ్లారు. దీంతో ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ల చిత్రీకరణ కూడా జరుగుతుందనే టాక్‌ వినిపిస్తోంది. ఇక ప్రముఖ నటి–నిర్మాత ప్రియాంకా చోప్రా మలయాళ దర్శక–నిర్మాత–నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాకు కథ అందించగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం  2027లో విడుదలయ్యే అవకాశం ఉందని భోగట్టా.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)