Breaking News

బుల్లితెర నటుడి ఎంగేజ్‌మెంట్‌! నటికి మాత్రం రెండో పెళ్లి!

Published on Wed, 07/23/2025 - 18:57

సీరియల్‌ నటుడు మహేశ్‌బాబు కాళిదాస్‌ (Mahesh Babu Kalidasu), నటి సాండ్రా జైచంద్రన్‌ (Sandra Suhasini Jaichandran) త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా కలిసుంటున్న వీరు ఇటీవలే తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అందరూ అనుకుంటున్నట్లు తాము లవ్‌లో ఉన్నామని వెల్లడించారు. జీవితాంతం ఈ ప్రేమను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఒక్కసారి ప్రపోజ్‌ చేయలేదు
అలా అన్నారో లేదో, ఇంతలోనే ఓ షోలో కుటుంబసమేతంగా ఇద్దరూ స్టేజీ ఎక్కారు. సాండ్రా పల్లకిలో రాగా.. నాకు కాబోయే శ్రీమతిని మా ఇంటికి తీసుకొస్తున్నా అంటూ ఆనందపడిపోయాడు మహేశ్‌. స్టేజ్‌పై రెండు కుటుంబాల సమక్షంలో ప్రియురాలు సాండ్రాకు ఉంగరం తొడిగాడు మహేశ్‌. ఒక్కసారి కూడా తనకు ప్రపోజ్‌ చేయలేదంటూ తొలిసారి ఐ లవ్యూ చెప్పి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

సీరియల్‌తో ప్రయాణం మొదలు
ఇకపోతే మహేశ్‌.. మనసిచ్చి చూడు, శుభస్య శీఘ్రం సీరియల్స్‌లో హీరోగా నటించాడు. సాండ్రా జైచంద్రన్‌.. ముద్దమందారం, కలవారి కోడళ్ళు సహా పలు సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఆటో విజయశాంతి ధారావాహికలో నటిస్తోంది. శుభస్య శీఘ్రం సీరియల్‌లో ఇద్దరూ కలిసి పనిచేసిన సమయంలోనే ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఈ ధారావాహిక పూర్తయిన తర్వాతే వీరిద్దరూ SaMa ప్రయాణం అంటూ ఓ యూట్యూబ్‌ ఛానల్‌ స్టార్ట్‌ చేశారు. ఇద్దరూ కలిసి ట్రిప్పులు, సరదా వీడియోలు పోస్ట్‌ చేసేవారు. ఇకపోతే సాండ్రాకు 19 ఏళ్లకే పెళ్లయింది. భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని తెలిసి విడాకులు తీసుకుంది.

 

 

చదవండి: నాది దొంగ ఏడుపు కాదు, నేనేం పిచ్చిదాన్ని కాదు.. కాపాడండి: హీరోయిన్‌

Videos

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)