హైటెక్‌ సిటీ ఆఫీసులో మహేశ్‌ బాబు .. వీడియో వైరల్‌

Published on Thu, 02/09/2023 - 14:48

సినీ తారలు బయట కనిపిస్తే ఫ్యాన్స్‌ చేసే హంగామా అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరో కనబడగానే ఎగబడిపోతుంటారు ఫ్యాన్స్‌. అందుకే మన స్టార్స్‌ అంతా ప్రైవసి కోసం ఎక్కువగా విదేశాల్లో వాలిపోతుంటారు. అక్కడ రోడ్లపై ఎలాంటి హడావుడి లేకుండా కూల్‌గా ఎంజాయ్‌ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు. షూటింగ్‌కి గ్యాప్‌ దొరికితే చాలు ఫ్యామిలీతో వెకేషన్‌ ప్లాన్‌ చేస్తాడు. అందుకే హైదరాబాద్‌ రోడ్లపై మహేశ్‌ చాలా అరుదుగా కనిపిస్తాడు. 

చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. సింగర్‌ యశస్వి చీటింగ్‌ బట్టబయలు!

సినిమా షూటింగ్‌, ఈవెంట్స్‌ తప్పితే పెద్దగా బయటకు రాడు. అలాంటి మహేశ్‌ బాబు తాజాగా హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో కనిపించాడు. చూట్టు ఎలాంటి హడావుడి లేకుండా చాలా కూల్‌ తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే అది సినిమా షూటింగ్‌ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అవును మహేశ్‌ తాజాగా తన పర్సనల్‌ పని మీదగా స్వయంగా హైటెక్‌ సిటీకి వచ్చాడు. తన ఆధార్ కార్డ్‌కు సంబంధించి వెరిఫికేషన్ కోసం హైటెక్ సిటీలోని దుర్గం చెరువు వద్ద ఉన్న ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఆఫీస్‌కు హాజరయ్యాడు మహేశ్‌.

చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. శ్రీహాన్‌ ముందే స్టేజ్‌పై సిరి కన్నీళ్లు!

అయితే ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకుని వెళ్లిపోయాడు. ఆఫీస్‌లో ఆధార్‌ వెరిఫికేషన్‌ చేసుకుంటున్న దృశ్యాన్ని అక్కడి వారు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఈ వీడియోలో మహేశ్‌ బాబు కొత్త లుక్‌లో కనిపించాడు. లాంగ్‌ హెయిర్‌ కట్‌, క్యాజువల్‌ షర్ట్‌లో​ ఆకట్టుకున్నాడు. కాగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎస్‌ఎస్‌ఎమ్‌బి28 చిత్రంతో మహేశ్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లో షూటింగ్‌ జరపుకుంటోంది. 

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)