Breaking News

మనం ఒకటిగా పోరాడాలి!

Published on Tue, 08/27/2024 - 00:02

‘నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది.. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ’ అంటూ మొదలవుతుంది ‘ముఫాసా: ద లయన్  కింగ్‌’ సినిమా తెలుగు ట్రైలర్‌. 2019లో వచ్చిన హాలీవుడ్‌ చిత్రం ‘లయన్  కింగ్‌’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ద లయన్ కింగ్‌’ రానుంది. ఆస్కార్‌ అవార్డు విజేత బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించారు. వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్, పాస్టెల్‌  ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 20న ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. 

కాగా ఈ సినిమాలో హీరోగా కనిపించే ముఫాసాకు హీరో మహేశ్‌బాబు తెలుగు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు మహేశ్‌బాబు. ‘అప్పుడప్పుడు ఈ చల్లగాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలన్నీ గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తుంది’, ‘అంతలోనే మాయం అవుతుంది’, ‘మనం ఒక్కటిగా పోరాడాలి’ అంటూ మహేశ్‌ బాబు వాయిస్‌తో చెప్పే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. అలాగే ‘బయటి వాడు ఎప్పుడూ పగవాడే.. దూరం పెట్టాలి. ఠాకేనే మనకు కాబోయే రాజు’ వంటి డైలాగులు కూడా ట్రైలర్‌లో వినిపిస్తాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని పుంబా పాత్రకు బ్రహ్మానందం, టిమోన్  పాత్రకు అలీ వాయిస్‌ ఓవర్లు ఇచ్చారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)