Breaking News

రాయన్‌ను అభినందించిన మహేశ్‌ బాబు

Published on Tue, 07/30/2024 - 10:06

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. విడుదల సమయంలో మిక్సిడ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. రాయన్‌ తెరకెక్కించిన తీరును చూసిన ప్రేక్షకులు ధనుష్‌ టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. ఇందులోని నటీనటులు అందరూ కూడా తమ అద్భుతమైన నటనతో ఇచ్చిపడేశారు. అందుకే రాయన్‌ టీమ్‌పై అభినందనల వెల్లువ వస్తుంది. తాజాగా టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేశ్‌ బాబు రాయన్‌ సినిమా చూసి ఫిదా అయ్యారు. సినిమాపై అయన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు.

సోషల్ మీడియా వేదికగా రాయన్‌ సినిమాపై మహేశ్‌ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. 'ధనుష్ అద్భుతంగా నటించడమే కాకుండా బ్రిలియంట్‌గా డైరెక్ట్ చేశారు. కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. రెహమాన్ మ్యూజిక్ సినిమాకు బాగా కలిసొచ్చింది. SJ సూర్య, ప్రకాశ్ రాజ్,సెల్వ రాఘవన్, సందీప్ కిషన్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ ఇతర నటీనటుల యాక్టింగ్ సూపర్. రాయన్‌ భారీ విజయాన్ని అందుకున్నాడు. మూవీ టీమ్‌కు  కంగ్రాట్స్' అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ధనుష్‌ కూడా రియాక్ట్‌ అయ్యారు. 'మీ ప్రశంసలతో మా టీమ్‌ ఆశ్చర్యానికి లోనైంది. మీ ఆత్మీయతకు చాలా ధన్యవాదాలు' అంటూ తెలిపారు. ఎస్‌.జే సూర్య, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళీ కూడా మహేశ్‌ బాబుకు తిరిగి సమాధానంగా కృతజ్ఞతలు తెలిపారు.

కోలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై ధనుష్ 50వ సినిమాగా రాయన్‌ సినిమా తెరకెక్కింది. మరోసారి తన రస్టిక్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. దీంతో తొలి మూడురోజుల్లోనే రూ. 75 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. కోలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా రాయన్‌ చిత్రానికి మంచి ఆదరణ లభించడం విశేషం.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)