Breaking News

మహేశ్‌బాబు, రాజమౌళి మూవీ 'టైటిల్‌'​ ఇదేనా..?

Published on Thu, 10/09/2025 - 11:32

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మహేశ్‌బాబు(Mahesh Babu), రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. SSMB29  పేరుతో ఈ ప్రాజెక్ట్‌ ఇప్పటికే మొదలైంది. అయితే, ఈ మూవీ టైటిల్‌ గురించి ఒక చర్చ సోషల్‌మీడియాలో జరుగుతుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే నాలుగు షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఒరిస్సా, కెన్యా, వంటి ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంది. నైరోబి, టాంజానియాల్లో కొత్త షెడ్యూల్‌ కోసం ప్లాన్‌ చేస్తోంది.

SSMB29 ప్రాజెక్ట్‌ నుంచి మహేశ్‌ ప్రీలుక్‌ ఫోటోను దర్శకుడు రాజమౌళి(ss rajamouli) పంచుకున్నారు. అయితే, పూర్తి లుక్‌ను నవంబర్‌లో రివీల్‌ చేస్తామని ఆయన గతంలోనే చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం టైటిల్‌ గురించి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ మూవీకి 'వారణాసి'(Vaaranaasi) అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు ఒక హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది.  ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడిగా ఈ మూవీలో మహేశ్‌బాబు  కనిపించనున్నారని సమాచారం. దీంతో ఈ టైటిల్‌ బాగుంటుందని కొందరు చెబుతన్నప్పటికీ మరికొందరు మాత్రం మరో పేరును ఎంపిక చేస్తే  బెటర్‌ అనే అభిప్రాయంలో ఉన్నారు. అయితే, ఇప్పటికే టైటిల్‌​ ట్యాగ్‌లైన్‌ #Globetrotter అని జక్కన్న ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇండియన్‌ సినిమా చరిత్రలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి చూపించబోతున్నారు. మహేష్‌‌ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా..  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో భాగం కానున్నారు.  శ్రీ దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)