Breaking News

మహేశ్‌ బాబు సినిమా ఈవెంట్‌.. ఓటీటీలో లైవ్‌

Published on Sun, 11/02/2025 - 13:55

మహేశ్‌బాబు(Mahesh Babu) అభిమానులు గుంటూరు కారం సినిమా తర్వాత ఆయన్ను వెండితెరపై మళ్లీ చూసేందుకు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 ప్రాజెక్ట్‌ అప్‌డేట్‌ కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే నాలుగు షెడ్యూల్‌ పైగానే పూర్తి చేసుకుంది. ఒరిస్సా, కెన్యా, వంటి ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంది. నైరోబి, టాంజానియాల్లో కొత్త షెడ్యూల్‌ కోసం ప్లాన్‌ చేస్తోంది. అయితే, నవంబర్‌ 16న సినిమా టైటిల్‌తో పాటు మహేశ్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయనున్నారు. అందుకోసం గ్రాండ్‌గా ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

SSMB29 ప్రాజెక్ట్‌ గురించి నవంబర్ 16న హైదరాబాద్‌లో ఒక భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేయాలని రాజమౌళి ఉన్నారట. సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియోను ఆవిష్కరించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ కార్యక్రమాన్ని అందరూ చూసేందుకు వీలు ఉండేందుకు ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుందట. ఈ అంశం గురించి త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్‌తో పాటు మరికొందరు సెలబ్రిటీలు పాల్గొననున్నారని సమాచారం.

ఇండియన్‌ సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి చూపించబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 ప్రారంభంలో విడుదల చేయాలని చూస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)