Breaking News

ప్రతిష్టాత్మక వేదికపై 'వారణాసి' టీజర్‌.. అధికారికంగా ప్రకటన

Published on Sun, 01/04/2026 - 12:19

మహేష్‌ బాబు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం వారణాసి.. యాక్షన్‌ అడ్వెంచరస్‌గా రానున్న ఈ మూవీపై ఇండియన్‌ సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టీజర్‌ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌లో #GlobeTrotterevent టైటిల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీ కథా నేపథ్యాన్ని తెలిపేలా ఉన్న ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయింది.

 జనవరి 5న పారిస్‌లో టీజర్‌
వారణాసి నుంచి వచ్చిన తాజా అప్‌డేట్ ఏమిటంటే.., అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఈ మూవీ టీజర్‌ ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ఇప్పుడు చరిత్ర సృష్టించనుంది. పారిస్‌(Paris)లోని 'లే గ్రాండ్ రెక్స్‌'(Grand Rex)లో ఈ టీజర్‌ను విడుదల చేయనున్నారు. 2,702 సీట్లు కలిగిన ఈ థియేటర్‌.. యూరప్‌లోనే అతిపెద్దదిగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై టీజర్‌ను ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రంగా మహేష్‌ బాబు వారణాసి చిత్రం నిలుస్తుంది. జనవరి 5 రాత్రి 9 గంటలకు టీజర్‌ విడుదల కానుంది. 

భారతీయ సినిమాల ఫ్రెంచ్ పంపిణీదారు అన్న ఫిల్మ్స్ ఈ వార్తను ధృవీకరించింది. టీజర్‌ను పెద్ద స్క్రీన్‌పై గొప్ప ఫార్మాట్‌లో ప్రదర్శించడంతుందని ఇది ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తుందని వారు భావిస్తున్నారు. వారణాసిని ప్రపంచ వార్తల్లో ఉంచడానికి రాజమౌళి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీని మార్చి 2027లో విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు.

శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ, షోయింగ్ బిజినెస్‌కు చెందిన ఎస్.ఎస్. కార్తికేయతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. స్వరకర్త ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చగా.. కథ స్క్రీన్‌ప్లేను విజయేంద్ర ప్రసాద్ రాశారు.

Videos

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)