Breaking News

Maha Shivaratri 2023: థియేటర్స్‌లో మళ్లీ ఆ సూపర్‌ హిట్‌ మూవీస్‌..ఎక్కడ?

Published on Fri, 02/17/2023 - 13:40

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోలు నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శిస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. హీరోల పుట్టినరోజు లేదా ఏదైన పండగ రోజు చూస్కొని పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్‌ హీరోలు మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి, వెంకటేశ్‌, బాలకృష్ణల సినిమాలు రీరిలీజై.. మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో స్పెషల్‌ డే వస్తే చాలు ఓల్డ్‌ సూపర్‌ హిట్‌ మూవీస్‌.. రీరిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న కూడా చాలా సినిమాలు మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. శివరాత్రి రోజు రీరిలీజ్‌కు రెడీ అయిన స్టార్‌ హీరోల సినిమాలపై ఓలుక్కేద్దాం. 

పుష్ప ది రైజ్‌
ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం పుష్ప. 2021 డిసెంబర్‌ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది.  మహా శివరాత్రిని పురస్కరించుకొని  ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లోని సుష్మ 70 ఎమ్‌ఎమ్‌ థియేటర్‌లో ఉదయం 3 గంటలకు స్పెషల్‌ షో వేయనున్నారు. 

అఖండ..
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ అఖండ. 2021 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్ల రాబట్టింది. ఇందులో అఘోరాగా బాలయ్య నటన అందరిని ఆకట్టుకుంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా మళ్లీ విడుదల కాబోతుంది.  ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లోని సుదర్శన్‌ 35 ఎమ్‌ఎమ్‌ థియేటర్‌లో అర్థరాత్రి 12.15 నిమిషాలకు, సుష్మ 70 ఎమ్‌ఎమ్‌ థియేటర్స్‌లో రాత్రి 11.49 గంటలకు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. 



వాల్తేరు వీరయ్య
మెగాస్టార్‌ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం వాల్తేరు వీరయ్య కూడా మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయనుంది. శివరాత్రి పురస్కరించుకొని  ఫిబ్రవరి 18న సంధ్య 70 ఎమ్ఎమ్ లో అర్థ రాత్రి 12.15గంటలకు, అలాగే ఉదయం 3 గంటలకు  వాల్తేరు వీరయ్య స్పెషల్‌ షో వేయనున్నారు. 

కాంతార
చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ గతేడాది సెప్టెంబర్‌  30న విడుదలై సంచలనం సృష్టించింది. ఇదే పేరుతో టాలీవుడ్‌లో అక్టోబర్‌ 15న విడుదలై..ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శివరాత్రి రోజు హైదరాబాద్‌లోని సప్తగిరి 70ఎమ్‌ఎమ్‌ థియేటర్‌లో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 3 గంటలకు ప్రదర్శంచనున్నారు. 

టెంపర్‌
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌  పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన టెంపర్‌ మూవి ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్‌ని కొత్త లుక్‌లో చూపించడమే కాదు.. యాక్టింగ్‌లోనూ మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు తెలియజేసిన చిత్రమిది. ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్‌లోని దేవి థియేటర్స్‌లో అర్థరాత్రి 12.15 గంటలకు, సంధ్య థియేటర్స్‌లో అర్థరాత్రి 12.30 గంటలకు ప్రదర్శించనున్నారు.

వీటితో పాటు మహేశ్‌బాబు నటించిన సరిలేరే నీకెవ్వరు సినిమా కొత్తపేటలోని మహాలక్ష్మీ కాంప్లెక్స్‌లో శనివారం అర్థరాత్రి 11.59 గంటలకు,  దూకుడు చిత్రం సుదర్శన్‌లో ఉదయం 3 గంటలకు ప్రదర్శించనున్నారు. అలాగే పవన్‌ కల్యాణ్‌ నటించిన భీమ్లా నాయక్‌ చిత్రం కూడా మహాలక్ష్మీ కాంప్లెక్స్‌లో ఉదయం 3 గంటలకు విడుదల కానుంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)