Breaking News

'కింగ్డమ్‌'ను ఎవరూ ఆడ్డుకోలేరు: కోర్టు

Published on Fri, 08/08/2025 - 10:25

నటుడు విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం కింగ్డమ్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్రంపై తమిళనాడులో కొన్ని రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. చిత్రాన్ని నిషేధించాలంటూ ఆందోళన కార్యక్రమాలను చేస్తున్నారు. దీంతో కింగ్డమ్‌ తమిళనాడు విడుదల హక్కులను పొందిన ఎస్‌ఎస్‌ఐ ప్రొడక్షన్స్‌ రంగంలోకి దిగింది.  కింగ్డ్‌మ్‌ చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ న్యాయమూర్తి భరత చక్రవర్తి ముందుకు వచ్చింది. 

పిటిషనర్‌ తరపు న్యాయవాది వివరణ ఇస్తూ కింగ్డమ్‌ చిత్రం కల్పిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం అని, ఇందులో సమాజంలోని ఏ వర్గాన్ని కించపరచే సన్నివేశాలు లేవని, ఏ వర్గాన్నీ ప్రతి కూలంగా చిత్రీకరించే ఉద్దేశం తమకు లేదని వాదించారు. నామ్‌ తమిళర్‌ పార్టీ  తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలను వినిపిస్తూ  చిత్రంలో శ్రీలంక తమిళులను వలస దారులు, అక్రమ రవాణాదారులంటూ తప్పుగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తున్నామని, చిత్ర ప్రదర్శనలను నిషేధించాలని నామ్‌ తమిళర్‌ పార్టీ కోరడం లేదని పేర్కొన్నారు. 

పోలీసుల వివరాల ప్రకారం కింగ్డమ్‌ చిత్రం జూలై 31 నుంచి ప్రదర్శింపబడుతోందని, ఎక్కడా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరిగినా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటున్నామని, థియేటర్ల యాజమాన్యానికి ఎక్కడా బెదిరింపులు రావడం లేదని పేర్కొన్నారు. అలాంటివి జరిగితే పోలీసుల భద్రత కల్పిస్తామని న్యాయస్ధానానికి  తెలియజేశారు. ఇరువర్గాల వాదలను విన్న న్యాయమూర్తి  ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు.  సెన్సార్‌బోర్డు సర్టిఫికెట్‌‌ ఇచ్చిన చిత్రాలను ఎవరూ ఆపలేరన్నారు. మీకు సినిమా నచ్చకపోతే చూడడం మానేయాలన్నారు. అదేవిధంగా నామ్‌ తమిళర్‌ పార్టీకి చెందిన వారికి  కూడా శాంతియుతంగా తమ నిరసనలను వ్యక్తం చేసే హక్కు కూడా ఉందన్నారు. అయితే దాన్ని కేటాయించిన ప్రాంతంలోనే నిర్వహించాలన్నారు. నిరసనలను ఆపే హక్కు ఎవరికీ లేదన్నారు. కింగ్డమ్‌ చిత్రానికి అంతరాయం కలిగిస్తే తగిన భద్రత కల్పించాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశించారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)