Breaking News

రూ.67 లక్షల కారు.. నాన్న కొనివ్వలేదు, నేనే లోన్‌ పెట్టి..: సురేశ్‌ గోపి కుమారుడు

Published on Mon, 06/30/2025 - 18:26

'తండ్రి ఎంత సంపాదించాడన్నది నాకు ముఖ్యం కాదు. నా కష్టార్జితంతోనే నేను ముందుకు సాగుతాను' అంటున్నాడు మలయాళ నటుడు మాధవ్‌ సురేశ్‌. కేంద్రమంత్రి, నటుడు సురేశ్‌ గోపి కుమారుడే మాధవ్‌. ఇటీవల ఇతడు లగ్జరీ బ్రాండ్‌ గోల్ఫ్‌ జీటీఐ కారు కొనుగోలు చేశాడు. తండ్రి సంపాదనతోనే ఇంత పెద్ద కారు కొన్నాడని పలువురు కామెంట్లు చేశారు. తాజాగా ఈ కామెంట్లపై మాధవ్‌ స్పందించాడు. 

నాన్న కొనివ్వలేదు..
ఓ ఇంటర్వ్యూలో మాధవ్‌ సురేశ్‌ (Madhav Suresh) మాట్లాడుతూ.. ఇటీవల నేను గోల్ఫ్‌ జీటీఐ కారు కొన్నాను. కేరళలో దీని ధర రూ.67 లక్షలు. మిగతా రాష్ట్రాల్లో అయితే దీని ఖరీదు ఇంకా ఎక్కువే ఉంటుంది. అయితే కారు తెచ్చుకోగానే చాలామంది మా నాన్నే కొనిచ్చాడని నన్ను తీసిపడేశారు. మీ అందరికీ ఓవిషయం చెప్తున్నా.. అది లోన్‌ తీసుకుని కొన్నాను. ప్రతి నెల కారు ఈఎమ్‌ఐ నేనే కట్టుకుంటాను. నా సంపాదనతోనే లోన్‌ చెల్లిస్తాను. మా నాన్న సంపాదించిందంతా ఆయన రిటైర్‌ అయ్యాక విశ్రాంత జీవితం గడిపేందుకు ఉపయోగపడుతుంది. లేదంటే నా సోదరీమణుల పెళ్లికి ఖర్చు చేస్తాడు. ఆయన డబ్బు వాటికోసం మాత్రమే ఉపయోగించాలి.

ట్రోల్స్‌.. లైట్‌ తీసుకుంటా
ఒకవేళ నేను సంపాదించలేకపోతే అప్పుడు ఆయన సాయం తీసుకుంటాను.  కానీ నేను కొన్న కారు మా నాన్న ఇచ్చిందైతే కాదు. నేను నా కోసం, నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. ఇక నన్ను తిట్టేవాళ్లపై నాకేమాత్రం కోపం లేదు. ఎందుకంటే నాకోసం వారు సమయం కేటాయిస్తున్నారు. అలా అని వారి ట్రోలింగ్‌కు స్పందిస్తూ కూర్చోను. నాకు గౌరవం ఇచ్చేవారినే తిరిగి గౌరవిస్తాను. నాన్న బీజేపీ మంత్రి అవడం వల్ల చాలామంది ఆయన్ని, మా కుటుంబం మొత్తాన్ని ద్వేషిస్తూ ఉంటారు. వాటిని నేను లెక్క చేయను అని మాధవ్‌ సురేశ్‌ చెప్పుకొచ్చాడు.

సినిమా..
మాధవ్‌ ప్రస్తుతం 'జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ' మూవీ చేశాడు. ఇందులో సురేశ్‌ గోపి, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రవీణ్‌ నారాయణన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ టైటిల్‌పై సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవి మరో పేరైన జానకిని.. సినిమాలో దాడికి గురైన మహిళకు పెట్టడం సమంసజం కాదని అభిప్రాయపడింది. ఈ విషయంపై నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో జూన్‌ 27న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది.

చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్‌

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)