Breaking News

'వాటితో ఎలాంటి ఉపయోగం లేదు'.. పూనమ్‌ ట్వీట్‌పై మా అసోసియేషన్ రియాక్షన్‌

Published on Sun, 01/05/2025 - 16:40

హీరోయిన్ పూనమ్ కౌర్‌ ట్వీట్‌పై మా అసోసియేషన్ స్పందించింది. మా తరఫున నటుడు కోశాధికారి శివబాలాజీ ఆమె చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఆమె నుంచి మాకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. మా కంటే ముందుగా కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు.

అంతేకాకుండా పూనమ్ కౌర్ కేవలం ట్విటర్‌లో పోస్టులు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని శివబాలాజీ వెల్లడించారు. మా అసోసియేషన్‌ను, న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తే ఆమెకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ ఎపిసోడ్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె పోస్ట్‌పై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

కాగా.. అంతకుముందు పూనమ్ కౌర్‌ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్ డైరెక్టర్‌ త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్‌ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. గతంలోనూ చాలాసార్లు తన బాధను వ్యక్తం చేసిన పూనమ్ కౌర్‌ మరో ట్వీట్‌తో చర్చకు దారితీసింది.

గతంలోనూ పోస్టులు..

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు, సినీ నటి పూనమ్‌ కౌర్‌ వివాదం ఇప్పటిది కాదు. గతంలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్‌ కౌర్‌ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్‌ ఇంతవరకు స్పందించలేదు.

పూనమ్ కౌర్ సినీ కెరీర్..

ఇక పూనమ్‌ కౌర్ సినిమాల విషయానికొస్తే..  మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక  విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)