Breaking News

Maa Oori Polimera 2 : కవిత ఎలా బతికొచ్చిందో తెలిసేది ఆ రోజే!

Published on Wed, 08/30/2023 - 13:53

సత్యం రాజేశ్‌, బాలాదిత్య, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కరోన సమయంలో ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని అప్పుడే ప్రకటించింది చిత్రబృందం. తాజాగా ఆ సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ని చిత్రబృందం వెల్లడించింది. ‘మా పూరి పొలిమేర-2’ ఈ సారి డైరెక్ట్‌గా ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నామని ప్రకటించారు. డా. అనిల్‌ విశ్వ‌నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 2న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. 

కవిత ఎలా బతికొచ్చింది?
మొదటి భాగంలో కొమిరి(సత్యం రాజేశ్‌)..గర్భిణి కవిత(రమ్య) బంధువుల చెతిలో దెబ్బలు తిని, ఆమె చితిలోనే పడి చనిపోయినట్లు చూపించారు. అయితే చితిలో పడి చనిపోయింది కొమిరి కాదని ఆయన తమ్ముడు జంగయ్య(బాలాదిత్య) గుర్తిస్తాడు. క్లైమాక్స్‌లో కొమిరి కేరళలో ఉన్నట్లు చూపించారు.అంతేకాదు చనిపోయిన కవిత కూడా బతికే ఉన్నట్లు, కొమిరితో కలిసి ఉన్నట్లు చూపిస్తూ.. శుభం కార్డు వేశారు. అసలు చనిపోయిన గర్భిణి ఎలా బతికొచ్చింది? అనేది తెలియాలంటే నవంబర్‌ 2 థియేటర్స్‌లో ‘పొలిమేర-2’చూడాల్సిందే. 

అంచనాలకు తగ్గట్టే సీక్వెల్‌
మా ఊరి పొలిమేర‌` మొద‌టి పార్ట్  ఎంత పెద్ద హిట్ట‌యిందో అంద‌రికీ తెలిసిందే. సెకండ్ పార్ట్ పై ఇప్ప‌టికే భారీ అంచానాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత గౌరికృష్ణ అన్నారు. `గ్రామీణ నేప‌థ్యంలో జ‌రిగే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి `మా ఊరి పొలిమేర‌-2` చిత్రాన్ని తెర‌కెక్కించాం. మొద‌టి పార్ట్ క‌న్నా సెకండ్ పార్ట్ ఇంకా ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌బోతుంది’అని దర్శకుడు విశ్వనాథ్‌ అన్నారు.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు