తిరుమలలో మరో అపచారం
Breaking News
MAA Elections 2021: ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు వీరే
Published on Thu, 06/24/2021 - 15:17
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది. అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, హీరో మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్, హేమ ప్రకటించారు. దీంతో మా ఎన్నికలు నాలుగుస్తంభాలాటగా మారింది. ఇక మా ఎన్నికల్లో ముందు నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్న ప్రకాశ్ రాజ్‌తన ప్యానల్ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27మందితో ఈ జాబితాను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ‘త్వరలో జరగబోయే ఎన్నికలను పురస్కరించుకుని ‘మా’ శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్ట కోసం.. మన నటీ నటుల బాగోగుల కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విషయాన్ని తెలియపరుస్తున్నా’అని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో సీనియర్ నటి జయసుధ, హీరో శ్రీకాంత్, యాంకర్ అనసూయ, నిర్మాత బండ్ల గణేశ్, సుడిగాలి సుధీర్ తదితరులు ఉన్నారు.
ప్రకారాజ్ ప్యానల్ సభ్యులు వీరే
1. ప్రకాశ్ రాజ్
2. జయసుధ
3. శ్రీకాంత్
4. బెనర్జీ
5. సాయికుమార్
6. తనీష్
7. ప్రగతి
8. అనసూయ
9. సన
10. అనిత చౌదరి
11. సుధ
12. అజయ్
13. నాగినీడు
14. బ్రహ్మాజీ
15. రవిప్రకాష్
16. సమీర్
17. ఉత్తేజ్
18. బండ్ల గణేష్
19. ఏడిద శ్రీరామ్
20. శివారెడ్డి
21. భూపాల్
22. టార్జాన్
23. సురేష్ కొండేటి
24. ఖయ్యుం
25. సుడిగాలి సుధీర్
26. గోవిందరావు
27. శ్రీధర్‌రావు
Tags : 1