ఏమయ్యా చంద్రబాబు.. అకాల వర్షం వస్తే రైతుల పరిస్థితి ఏంటి?
Breaking News
మా సినిమాను చూసి విదేశీయులు ఆశ్చర్యపోయారు: జో శర్మ
Published on Thu, 05/07/2026 - 06:16
‘‘మా ‘ఎమ్4ఎమ్’ రిలీజ్‌కు ముందే 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు గెల్చుకుంది. గత ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా సినిమాను గ్లోబల్ ప్రీమియర్ వేశాం. సబ్ టైటిల్స్‌తో మా సినిమాను చూసిన విదేశీయులు ఆశ్యరపోయారు. సినిమా పూర్తయిన తర్వాత స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు’’ అని జో శర్మ చెప్పారు. సంబీత్ ఆచార్య, జో శర్మ లీడ్ రోల్స్‌లో నటించిన సినిమా ‘ఎమ్4ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో జో శర్మ మాట్లాడుతూ– ‘‘నేను హైదరాబాద్‌లో పుట్టాను. ముంబై, నాగపూర్‌లో పెరిగాను. ‘ఎమ్4ఎమ్’ కోసం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చాను. అమెరికాలో థియేటర్ ఆర్టిస్ట్‌ని. అక్కడ నాకో థియేటర్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. అయినా మోహన్‌గారి దగ్గర మూడేళ్లు శిక్షణ తీసుకుని, ఈ సినిమాలో నటించాను. ఇందులో రాధ అనే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించాను. ఈ సినిమాకి కో –రైటర్‌గానూ చేశాను. దీంతో రాధ పాత్రని నేను మరింత స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దుకునే అవకాశం కలిగింది. ఇక మా సినిమా విడుదలైన రోజున సినిమా పూర్తయ్యే లోపు విలన్ ఎవరో చెబితే లక్ష రూపాయలు బహుమతి ఇస్తాం’’ అని చెప్పారు.
Tags : 1