Breaking News

ప్రతి పాట ఓ సవాల్‌

Published on Mon, 09/15/2025 - 04:26

‘‘ఇటీవల సంగీతంలో సౌండ్‌ డిజైనింగ్‌ మారింది. ఈ సౌండ్‌కు తగ్గట్లుగా సాహిత్యం కూడా మారుతూ వస్తోంది. పదేళ్ల తర్వాత మన పాట విన్నా  మంచి సాహిత్యం రాశారు అనిపించేలా నా  పాటల ద్వారా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాను’’ అని తెలిపారు గీత రచయిత శ్రీమణి. ‘100 పర్సెంట్‌ లవ్‌’ సినిమాతో గీత రచయితగా పరిచయమైన శ్రీమణి దశాబ్ద కాలానికి పైగా రాణిస్తున్నారు. 

నేడు (సోమవారం) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదివారం శ్రీమణి తన కెరీర్‌ జర్నీ గురించి మాట్లాడుతూ – ‘‘ఇటీవల ‘తండేల్‌’ చిత్రంలో ‘బుజ్జి తల్లి, హైలెస్సా’ పాటలతో పాటు ‘లక్కీ భాస్కర్‌’లోని ‘నిజమా కలా’, ‘ఆయ్‌’ సినిమాలోని పాట నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఈ పాటలన్నీ కథలో ఉన్న సన్నివేశం తాలూకు లోతైన భావం చెప్పడమే. నేనీ పాటలు రాయగలనని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన సంగీత దర్శకులకు, దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు.

 ఇక ప్రేమ పాటలు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి కొత్త ఎక్స్‌ప్రెషన్‌తో రాయగలను అనేది, అలాగే హీరో ఎలివేషన్‌ సాంగ్‌ వచ్చినప్పుడు హీరో క్యారెక్టరైజేషన్‌ ఓ డిఫరెంట్‌ కోణంలో ఎలా చెప్పగలను? అనేది ఛాలెంజ్‌ అవుతుంది. ఇలా ప్రతి పాటా ఓ సవాలే. నన్ను గీత రచయితగా పరిచయం చేసిన దర్శకుడు సుకుమార్‌గారు ‘గీత గోవిందం’ సినిమాలో ‘వచ్చిందమ్మా పాట..’ను మెచ్చుకున్నారు. 

మహేశ్‌బాబుగారి ‘మహర్షి’లోని పాటలు విని, ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు అభినందించారు. ‘రంగ్‌ దే’లోని ‘ఊరంతా..’, ‘మహర్షి’లోని ‘ఇదే కదా..’, ‘ఉప్పెన’ లోని ‘నీ కళ్లు నీలి సముద్రం..’ పాటలను దేవిశ్రీ ప్రసాద్‌ మెచ్చుకున్నారు. ప్రస్తుతం దుల్కర్‌ ‘ఆకాశంలో ఓ తార’, సాయి దుర్గా తేజ్‌ ‘సంబరాల ఏటిగట్టు’, నిఖిల్‌ ‘ది ఇండియా హౌస్‌’ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలకు సాహిత్యం అందిస్తున్నాను’’ అన్నారు.

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)