Breaking News

ఆ పాట పాడుతూ నేను, వింటూ నా భార్య ఏడ్చేశాం : చంద్రబోస్‌

Published on Sun, 01/04/2026 - 12:25

తెలుగు సినీ సాహితీ వనంలో తనదైన ముద్ర వేసిన రచయిత చంద్రబోస్. ఆయన రాసిన ‘నాటు నాటు’ పాట ఏకంగా ఆస్కార్‌ అవార్డునే తీసుకొచ్చిపెట్టింది. చిన్న చిన్న పదాల్లో లోతైన అర్ధాన్ని చెప్పడం ఆయన స్టైల్‌. ఇప్పటికి వరకు ఆయన 3800 పాటలు రాశాడు. వాటిల్లో ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ ఉన్నాయి. అలాంటి ఓ సూపర్‌ హిట్‌ పాట మాత్రం 20 ఏళ్ల తర్వాత బాగా వైరల్‌ అయింది.రాసిన 20 ఏళ్ల తర్వాత ఆ పాటతో చంద్రబోస్‌కి మంచి గుర్తింపు వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబోసే చెప్పారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పాట గురించి చెప్పుకొచ్చాడు.

సాధన చేస్తే ఫలితం ఉంటుంది..
సాధన చేస్తే గుర్తింపు, ఫలితం సాధన చేస్తే ఫలితం, గుర్తింపు వస్తూనే ఉంటుంది. మన కష్టానికి ఏదో ఒక రోజు గుర్తింపు దక్కుతుంది. నేను రాసిన ఒక పాటకు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు గుర్తింపు వచ్చింది. ఆ పాట ఇదే. ‘ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే.. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే, బలపం నువ్వే ప్రశ్న నువ్వే, బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి’. ఇది 20 ఏళ్ల క్రితం ‘బడ్జెట్ పద్మనాభం’ సినిమా కోసం రాశాను. ఆ సినిమా రిలీజ్‌ అయినా ఈ పాటకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ అదే పాటను ఒక స్టేజ్‌ మీద పాడిన తర్వాత అది బాగా వైరల్‌ అయి.. నాకు గుర్తింపు వచ్చింది. లైఫ్‌ ఇన్స్‌రెన్స్‌ ఏజెంట్ల మీటింగ్‌లో ఆ పాటను పాడాను. వాళ్లంతా ఈ పాటను స్ఫూర్తిగా తీసుకొని వారి బిజినెస్‌ని పెంచుకున్నారు.

నా భార్య ఏడ్చింది
ఇదే ఇంటర్వ్యూలో రంగస్థలం సినిమాలోని  ‘ఓరయ్యో..’ అనే ఎమోషన్‌ సాంగ్‌ గురించి మాట్లాడారు.  ఏదైనా పాట రాయాలంటే..  ఆ సన్నివేశాలలో మనల్ని మనం ఊహించుకోవాలి.  రంగస్థలంలోని ‘ఓరయ్యో..’ పాటను నేను అలానే రాశాను. మన ఆప్తులు చనిపోతే ఎలా రోధిస్తాం.. ఎలా బాధపడతారు.. దాన్నే ఈ పాటలో చూపించాను. ‘ఈ సేతితోనే పాలు పట్టాను ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే తలకు పోసాను ఈ సేతితోనే కాళ్లు పిసికాను ఈ సేతితోనే పాడె మొయ్యాలా... ఈ సేతితోనే కొరివి పెట్టాలా... ఓరయ్యో నా అయ్యా.. ’ అనే పల్లవిని ఇంట్లోనే రాశాను. వంట చేస్తున్న నా భార్య దగ్గరకు వెళ్లి పాట సందర్భం చెబతూ... ‘అన్న చనిపోతాడు..తమ్ముడు ఏడుస్తూ ఉంటాడు.. ఆ సందర్భంలో పాట వస్తుంది’ అంటూ  ఈ పాటను వినిపిస్తే.. తను ఏడ్చేసింది. పాడుతూ నేను ఏడిస్తే.. వింటూ తాను కూడా ఏడ్చేసింది.  రచయిత అనేవాడు ప్రతి సందర్భాన్ని తనదిగా భావిస్తేనే.. తనదైన స్పందన అందిస్తాడు. రచయితకు కావాల్సింది పాండిత్యం.. భాష మీద విపరీతమైన సాధికారతో కాదు.. మనకున్న జ్ఞానం.. మనదైన అనుభవం.. మనలోని స్పందన.. ఈ మూడే రచయితను గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి’ అని చంద్రబోస్‌ చెప్పుకొచ్చాడు. 

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)