Breaking News

లూసిఫర్‌ సీక్వెల్‌ రెడీ.. మాలీవుడ్‌లో లైకా ప్రొడక్షన్స్‌ ప్లాన్‌

Published on Mon, 10/02/2023 - 13:12

కోలీవుడ్‌లో చిన్న చిత్రాల నుంచి భారీ చిత్రాల వరకు కేరాఫ్‌గా మారిన చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షనన్స్‌. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్‌ ఇప్పుడు మాలీవుడ్లోకి అడుగు పెట్టారు. కంప్లీట్‌ యాక్టర్‌గా పేరుగాంచిన మోహన్‌లాల్‌ బహుభాషా నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు దశాబ్దాలుగా కథానాయకుడిగా నటిస్తూ మాలీవుడ్‌లో (మలయాళం) అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో ఈయన ఒకరు.

(ఇదీ చదవండి: వాళ్లు అయితే నా దుస్తులు తొలగించేవారు.. ఊసరవెల్లి బ్యూటీ కామెంట్లు)

350 చిత్రాలకు పైగా చేసిన మోహన్‌ లాల్‌ ఈమధ్య నటించిన చిత్రం లూసిఫర్‌. దీనికి మరో మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించి అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. లూసిఫర్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా దానికి సీక్వెల్‌గా లూసిఫర్‌ 2 చిత్రం రూపొందుతోంది. ఇది కూడా మోహన్‌ లాల్‌, పృథ్విరాజ్‌ సుకుమారన్‌లో కాంబినేషన్‌లోనే తెరకెక్కడం విశేషం. కాగా విచిత్రాన్ని ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థ ఆశీర్వాద్‌ సినిమాస్‌ అధినేత ఆంటోని పెరంబలూర్‌తో కలిసి లైకా ప్రొడక్షనన్స్‌ సుభాస్కరన్‌ నిర్మిస్తుండడం మరో విశేషం.

దీని గురించి లైకా ఫిలిమ్స్‌ సంస్థ అధినేత సుభాస్కరన్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ దైవ దేశంగా భావించే మలయాళ చిత్ర పరిశ్రమంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. అంకితభావంతో పనిచేసే కళాకారులు సహజత్వంతో కూడిన సంస్కృతికి అద్దం పట్టే చిత్రాలను రూపొందించే మలయాళ చిత్ర పరిశ్రమలో లూసిఫర్‌ 2 చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని తాము పొందామని చెప్పారు. ఈ చిత్త పరిశ్రమ అభివృద్ధిని, ఈ చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ ధ్యేయంగా పేర్కొన్నారు. ఈ చిత్ర విజయం పదికాలాలపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందని సుభాస్కరన్‌ పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)