Breaking News

భారతీయుడు-2 మూవీపై అలాంటి ట్వీట్‌.. డైరెక్టర్‌పై నెటిజన్స్‌ ఫైర్!

Published on Sun, 07/14/2024 - 16:40

కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. 1996లో సూపర్ హిట్‌గా నిలిచిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతోంది. ఈ చిత్రంలో శంకర్ మార్క్ కనిపించలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ ఇండియన్‌-2 సినిమాపై ట్వీట్‌ చేశారు. శంకర్‌ సార్‌ నిబద్ధతకు.. కమల్ హాసన్‌ నటనకు భారతీయుడు-2 చిత్రం నిదర్శనమన్నారు. అద్భుతమైన బీజీఎం అందించిన అనిరుధ్ రవిచందర్‌కు నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ఇండియన్‌-3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రాసుకొచ్చారు.

అయితే ఇది చూసిన నెటిజన్స్‌ లోకేశ్‌ కనగరాజ్‌ ట్వీట్‌పై మండిపడుతున్నారు. మీరు ఇలాంటి రివ్యూ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఇలాంటి జోకులు వేయడం అపండి సార్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇండియన్‌-3 కోసం తాము సిద్ధంగా లేమని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మీరు కమల్ సార్ ఫ్యాన్ ‍అయినప్పటికీ.. ఇలా చెప్పడం తగదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దయచేసి కూలీ మూవీ, ఖైదీ, విక్రమ్ లాంటి సీక్వెల్‌ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవ్వండని లోకేశ్‌కు సూచిస్తున్నారు. కాగా.. ఇప్పటికే నిడివి ఎక్కువైందంటూ బాక్సాఫీస్ వద్ద విమర్శలు ఎదుర్కొంటున్న ఇండియన్‌-2పై పాజిటివ్‌ రివ్యూ ఇవ్వడంతో నెటిజన్స్ ఇలా రియాక్ట్‌ అయ్యారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)