Breaking News

ఎల్‌సీయూపై లోకేశ్‌ కనగరాజ్‌ ప్రకటన

Published on Sun, 10/13/2024 - 16:30

కోలీవుడ్‌ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానులు ఉన్నారు. త్వరలో రజనీకాంత్‌ 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు  ఆయన డైరెక్ట్‌ చేసిన ఖైదీ, విక్రమ్‌, లియో తదితర సినిమాలు టాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్నాయి. సరికొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెడుతూ 'సినిమాటిక్‌ యూనివర్స్‌'  (LCU) అనే కాన్సెప్ట్‌తో విజయాలను అందుకున్నారు.

కూలీ సినిమా గురించి లోకేశ్‌ కనగరాజ్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రం ‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (ఎల్‌సీయూ)లో భాగం కాదన్నారు. కానీ, కూలీ సినిమా తర్వాత అదిరిపోయే ప్రాజెక్ట్‌ రానుందని ఆయన ప్రకటించారు. సినిమాటిక్‌ యూనివర్స్‌  (LCU)లో భాగమైన స్టార్‌ హీరోలందరితో ఒక భారీ ప్రాజెక్ట్‌ ఉంటుందని రివీల్‌ చేశారు.

ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చామని లోకేశ్‌ చెప్పారు. రజనీకాంత్‌కు ఇటీవల సర్జరీ జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్‌ 16 నుంచి తలైవా సెట్స్‌లో ఎంట్రీ ఇస్తారని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నీ కూడా కేవలం ఆరు నెలల్లోనే పూర్తిచేశానని, ఇప్పుడు కూలీ చిత్రాన్ని ఈ సమయంలోపే ముగిస్తానని ఆయన పేర్కొన్నారు.

సినిమాటిక్‌ యూనివర్స్‌ (LCU) ప్లాన్‌ ఇదే

లోకేశ్‌ కనగరాజ్‌ రాబోయే సినిమాల గురించి కూడా మాట్లాడారు. రాబోయే ఐదేళ్లపాటు తన సినిమాల్లో బ్లడ్‌,గన్స్‌,డ్రగ్స్‌ ఉంటాయని చెప్పారు. ఆ తర్వాతే మరో భిన్నమైన సినిమాలు తీస్తానన్నారు. ఈ క్రమంలోనే ఖైదీ, విక్రమ్‌, లియోతో సినిమాటిక్‌ యూనివర్స్‌ కథ ప్రారంభమైందన్నారు. విక్రమ్‌ సినిమాలో రోలెక్స్‌ అనే కీలకమైన పాత్ర ఉందని రివీల్‌ చేశారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. 

రజనీతో కూలీ సినిమా పూర్తి చేసిన వెంటనే LCUలో భాగమైన హీరోలందరితో ఈ భారీ ప్రాజెక్ట్‌ ప్రారంభమౌతుంది. అంటే ఖైదీ, విక్రమ్‌, లియో ఈ మూడు సినిమాలను లింక్‌ చేస్తూ ఈ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌ ఉండనుంది. అయితే, 'లియో2' కోసం విజయ్‌ ఒప్పుకుంటే 'పార్తిబన్‌' పేరుతో తెరకెక్కిస్తానని లోకేశ్‌ కనగరాజ్‌ చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)