Breaking News

లియోకు నో సెలబ్రేషన్స్‌.. ఆ వేడుక జరుగుతుందా?

Published on Mon, 10/30/2023 - 10:53

విడుదలకు ముందు నుంచే వివాదాల్లో చిక్కుకున్న చిత్రం లియో. కారణం విజయ్‌ హీరోగా నటించడమే? అనే చర్చ జరిగింది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని నిర్మాతలు భావించారు. అయితే కారణాలేమైనా చివరి క్షణంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో 7 స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మించిన భారీ చిత్రం లియో. త్రిష, బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌, మిష్కిన్‌ తదతర భారీ తారాగణం నటించిన ఈ చిత్రం ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

కాగా ఈ చిత్రం వారంలోనే రూ.461 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాత అధికారికంగా వెల్లడించారు. దీంతో లియో చిత్ర విజయోత్సవాన్ని నవంబర్‌ ఒకటో తేదీన చైన్నెలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో భారీఎత్తున నిర్వహించ తలపెట్టారు. ఇందుకోసం పోలీస్‌ బందోబస్తు కోరుతూ నిర్మాత ఆ శాఖాధికారులకు లేఖ రాశారు.ఆ లేఖపై పోలీస్‌ అధికారులు పలు ప్రశ్నలు స్పందిస్తూ నిర్మాతకు తిరిగి లేఖ పంపారు.

ముఖ్యంగా లియో చిత్రం విజయోత్సవానికి వచ్చే సినీ ప్రముఖులు ఎందరు?, అభిమానులు ఎందరు? కార్యక్రమాన్ని ఎన్ని గంటల ప్రారంభించి, ఎన్ని గంటలకు ముగిస్తారు? నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఎన్ని కుర్చీలు ఉంటాయి? స్టేడియం నిర్వాహకులు అనుమతి పొందారా? దానికి సంబంధించిన పూర్తి వివరాలను చర్చించిన తరువాతే పోలీస్‌ బందోబస్తుపై నిర్ణయం తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో లియో చిత్రం విజయోత్సవ వేడుక జరుగుతుందా? అని విజయ్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)