Breaking News

మనసు భాషను ఆవిష్కరించిన మధుర స్వరం

Published on Tue, 10/13/2026 - 05:12

‘గాతా రహే మేరా దిల్‌’
‘మేరే దిల్‌ మే ఆజ్‌ క్యా హై’
‘ఓ మేరే దిల్‌... కే చౌన్‌’

వంటి మధుర గీతాలెన్నో పాడిన కిషోర్‌ కుమార్‌ దివంగతులై దశాబ్దాలు గడచినా ఆయన స్వరం మాత్రం ప్రతి రోజు వినబడుతూ రసానుభూతి అందిస్తుంది. ఆయన ప్రేమ మొదలు వేదాంతం వరకు ఎన్నో వైవిధ్యభరితమైన పాటలు పాడినప్పటికీ  దిల్‌ (మనసు) మీద పాడిన పాటలు మనసు లేని వారి మనసుల్ని కూడా కదిలిస్తాయన్నది అక్షర సత్యం.

హిందీ సినీ సాహిత్యంలో దిల్‌ అంటే కేవలం హృదయమనే కాదు, అది ప్రేమ, విరహం,ఆశ, నిరాశ, వేదాంతం వంటి అనేక భావాలకు  కేంద్రం!
→ ‘ముఖద్దర్‌’ (1950) లో ‘బల్మా హై దియా తుఝ్‌ కో’ అనే పాట ద్వారా కిషోర్‌ దా దిల్‌ పాటల శకం మొదలైందని చెప్పవచ్చు. తరువాత ‘దిల్‌ దిల్‌ పె మిలాకార్‌ దేఖో’, (‘మేమ్‌ సాబ్‌’ 1956) అనే పాటను పాడి యవతను ఆకట్టుకొన్నారు. ‘గాతా రహే మేరా దిల్‌‘ (‘గైడ్‌’ 1965) కిషోర్‌ దాకు సింగర్‌గా హీరో వర్షిప్‌ తెచ్చింది. ఇందులో ‘జల్నే వాలే చాహే జల్‌–జల్‌ మరేంగే’ అన్నపుడు ధిక్కార స్వరం ‘ఓ మేరే హమ్రాహీ’ అని పాడినపుడు ప్రేమికుడి ఆర్ద్రతను వ్యక్తం చేశారు.

→ ‘యే దిల్‌ నా హోతా బేచారా’ (‘జువెల్‌ థీఫ్‌’ 1967) పాటను దేవ్‌ ఆనంద్‌ నటనకు తగ్గట్లు పాడినట్లే, కిషోర్‌ దా తెరపై హీరోగా ‘బడా బద్మాష్‌ హై యే దిల్‌’ (‘దో దూని చార్‌’ 1968) అని హషారుగా పాడారు.

→ 1970 దశకంలో దిల్‌ గీతాలకు కిషోర్‌ దా కేరాఫ్‌ చిరునామా అయ్యారు... ఆయన పాడిన ‘ఓ మేరే దిల్‌ కే చైన్‌’ (‘మేరే జీవన్‌ సాథీ’ 1972) పాట ప్రేమికుడి హృదయ వేదనకు అద్దం పడుతుంది. 

→ కిషోర్‌ దా దిల్‌ గీతాలలో ప్రేమే కాదు తాత్వికత కూడా ఉంటుంది. ‘సచ్చా ఝూటా’ (1970)లో రాజేశ్‌ ఖన్నాకు పాడిన  ‘దిల్‌ కో దేఖో చెహరా న దేఖో’  అందుకు ఓ ఉదాహరణ. ‘బ్లాక్‌మెయిల్‌’ (1973) లోని ‘పల్‌ పల్‌ దిల్‌ కే పాస్‌’ ఒక ఆపాత మధురం... యాక్షన్‌ హీరోగా పేరున్న ధర్మేంద్రకు ఈ పాటను లలితంగా పాడటం విశేషం. ‘మేరే దిల్‌ మే ఆజ్‌ క్యా హై (‘దాగ్‌’ 1973)  పాటలో ‘ముఝే దేవతా బనాకర్, తేరీ  చాహతో నే పూజా..’ అని ప్రేమను దేవతతో ΄ోల్చి, ఎవర్‌ గ్రీన్‌ మెలోడీగా మార్చారు.

→ ‘జూలీ’ (1975)లో ‘దిల్‌ క్యా కరే జబ్‌ కిసీకో’ పాటను ప్రేమికుల మధ్య సహజంగా సాగే గుస గుసలాడే రీతిలో పాడారు. మనసుకు గాయం అయినపుడు    ప్రేమికుని వేదనను ‘దిల్‌ ఐసా కిసీ నే మేరా తోడా’ (‘అమానుష్‌’ 1975) అనే పాటలో పాడారు. ఈ చిత్రం రీమేక్‌ ‘ఎదురీత’లో ‘ఎదురీతకు అంతం లేదా’ అని ఎస్పీ బాలూతో పాడించారు.

→ ‘దూర్‌ కా రాహి’ (1971) చిత్రంలో కిషోర్‌ దా, సులక్షణ పండిట్‌లు  ‘బే ఖరార్‌ దిల్‌ తూ గాయేగా’ అని మనసును ఉద్దేశించి పాడిన పాట మన హృదయాలను కదిలిస్తుంది. ఈ చిత్రానికి కిషోర్‌ దా రచన, సంగీతం దర్శకత్వంతో పాటు హీరోగా నటించడం ఆయన బహు ముఖీన ప్రతిభకు నిదర్శనం!!

ఇవన్నీ కేవలం ఉదాహరణలు మాత్రమే... నిజానికి కిషోర్‌ దా దిల్‌ గీతాలు ఒక పరిశోధనాంశం... రఫీ సాబ్‌ కూడా దిల్‌ పాటలను అద్భుతంగా పాడారు. కానీ కిషోర్‌ దా హీరోలను బట్టి గాత్రాన్ని మలచారు. రాజేశ్‌ ఖన్నాకు సున్నితంగా, దేవ్‌ ఆనంద్‌కు లలిత గంభీరంగా ధర్మేంద్ర, అమితాబ్‌లకు బేస్‌ వాయిస్‌తో పాడటం వలన తెరపై నిజంగా ఆయా హీరోలే పాడుతున్నారనే భావన ప్రేక్షకులకు కలిగేది. రఫి దిల్‌ పాటల్లో క్లాసిజం ఎక్కువ... కిషోర్‌ దా పాటల్లో మాగ్నెటిజం ఎక్కువ. అందుకే ఎన్ని తరాలు మారినా ఆయన స్వరం ఎల్లప్పుడూ ‘పల్‌ పల్‌ దిల్‌ కే పాస్‌ తుమ్‌ రహతీ హో’ అన్నట్లుగా అందరి హృదయాలకు దగ్గరగానే ఉంటుంది.

– డా. వి.వి. రామారావు రచయిత, గాయకుడు, వ్యాఖ్యాత

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)