కీర్తనను చంపింది నిజమే.. శిక్ష వేయండి.. ఎన్ కౌంటర్ చేయొద్దు
Breaking News
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత
Published on Sun, 04/12/2026 - 12:57
లెజండరి సింగర్, క్వీన్ ఆఫ్ వెర్సటిలిటీ ఆశా భోంస్లే(92) కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు.

ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆశా భోంస్లే.. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో సుమారు 20 భారతీయ, విదేశీ భాషలలో పాటలు పాడారు. 2006లో ఆమె స్వయంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం, దాదాపు 12,000 పాటలను రికార్డ్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1950వ దశకంలో బాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆశా భోంస్లే 1952లో సంగ్దిల్ చిత్రంతో గుర్తింపుపొందారు.

1970 దశకంలో పియా తు అబ్ తో ఆజా , దమ్ మారో దమ్ , చురా లియా హై తుమ్నే పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన “మాంగ్ కే సాథ్ తుమ్హారా,” “సాథీ హాత్ బధానా”, “ఉదేన్ జబ్ జబ్ జుల్ఫెన్ తేరీ” వంటి పాటలు నేటికీ ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి. ఆపై ఆర్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో ఆశా భోంస్లే పాడిన పాటలు ఒక ట్రెండ్ సెట్ చేశాయి. “ఆజా ఆజా,” “పియా తూ అబ్ తో ఆజా,” “యే మేరా దిల్” వంటి డ్యాన్స్ నంబర్లతో అప్పట్లోనే సంచలనం సృష్టించిన ఆశా భోస్లే కమర్షియల్ పాటలకే పరిమితం కాకుండా గజల్స్ పాడి జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. 90వ దశకంలో ‘రంగీలా’ చిత్రంతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఆశా భోంస్లే.. సంగీత సామ్రాజ్ఞిగా కీర్తి పొందారు.
Tags : 1