Breaking News

రఘువరన్‌కు భిన్నంగా వారసుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

Published on Mon, 06/03/2024 - 19:34

నటుడు రఘువరన్ పేరు వినగానే విలక్షణమైన పాత్రలే గుర్తుకొస్తాయి. టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌ చిత్రాలలోనూ రఘువరన్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాల్లో నటించే సమయంలో నటి రోహిణిని పెళ్లాడారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించారు. అతనికి రిషివరన్ అనే పేరు పెట్టారు. అయితే 2004లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత చివరి రోజుల్లో ఆల్కహాల్‌కు బానిస అయిన రఘువరన్  2008 మార్చి 19న కన్నుమూశారు.

అయితే ప్రస్తుతం అతని కుమారుడు రిషి వరన్ తండ్రి బాటలోనే దూసుకెళ్తున్నాడు. 26 ఏళ్ల రిషివరన్ నటుడిగా కాకుండా సంగీతంలో రాణిస్తున్నాడు.  సినిమాల్లో నటనకు బదులు రిషివరన్ సంగీత రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే అతను కొన్ని ఇంగ్లిష్ ఆల్బమ్‌లు రిలీజ్‌ చేశాడు. రఘువరన్‌కి సైతం సంగీతంపై కూడా చాలా ఆసక్తి ఉండేది. సినిమా అవకాశాలు పెరగడంతో నటనలో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రిషివరన్‌ తండ్రిలాగే కొడుకు కూడా సంగీతంలో కొనసాగుతున్నాడు.

కాగా.. గతంలో రఘువరన్‌ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్‌గా తీసుకొచ్చారు. గతంలో రజనీకాంత్ చేతులమీదుగా ఈ ఆల్బమ్‌ను ఆయన భార్య రోహిణి, రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన నటనతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.  రఘువరన్ తన కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించారు. టాలీవుడ్‌లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో కనిపించారు. ఆయన మాజీ భార్య రోహిణి బాలనటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ ఆమె సినిమాల్లో కొనసాగుతున్నారు. 
 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)