Breaking News

ఎంట్రీతోనే బిగ్ డిజాస్టర్.. అయినా తగ్గట్లేదుగా హీరో!

Published on Tue, 03/14/2023 - 20:15

ప్రముఖ బిజినెస్‌మెన్‌ అరుల్ శరవణన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'ది లెజెండ్'. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అప్పట్లో హీరోగా శరవణన్ ఎంట్రీ ఇవ్వడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయితే తాజాగా కొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు శరవణన్. ట్రోలర్స్‌కు చెక్‌ పెట్టేందుకే న‍్యూ లుక్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో  గడ్డం, మీసాలతో శరవణన్ కాస్తా డిఫెరెంట్‌ లుక్‌లో కనిపించారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  

 సినిమాలంటే శరవణన్‌కు పిచ్చి

బిజినెస్‌మెన్ అయిన శరవణన్‌కు సినిమాలంటే పిచ్చి. తెరపై కనిపించాలన్నదే ఆయన కోరిక. అందువల్లే శరవణ స్టోర్స్ యాడ్‌లో కూడా తానే నటించాడు. స్టార్ హీరోయిన్లతో కలిసి తన బిజినెస్ బ్రాండ్లకు పబ్లిసిటీ ఇస్తుంటారు. గతేడాది జులైలో విడుదలైన ది లెజెండ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా శరవణన్ ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. తాజా లుక్ చూస్తే మరోసారి స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించేందకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ది లెజెండ్ సినిమాలో ఆయన నటించడంపై నెటిజన్లు దారుణమైన ట్రోల్స్ చేశారు.  కాగా..  ది లెజెండ్‌ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Videos

రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!

అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ

కమ్మేస్తోన్న కరోనా కాటేరమ్మ కొడుకునూ వదలని వైరస్

సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ

అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్

గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?

YSRCP కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు

ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం

ఓటమి భయంతో YSRCP నేతలపై దాడి

Photos

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు